Bagundu Bagundu song: ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి ప్రేమించిన వ్యక్తిని కాదని, మరొకర్ని పెళ్లి చేసుకున్న సంఘటనలు సహజంగా సినిమాల్లోనూ, రియల్‌గానూ చూస్తుంటునే ఉంటాం. అదే మన లైఫ్‌లో జరిగితే ఆ బాధ వర్ణాతీతం. మనం ప్రేమించిన అమ్మాయి మరొకర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎదురుపడినప్పుడు ఆ యువకుడు పడే బాధ మామూలుగా ఉండదు.
అలాంటి బాధలో నుండి పుట్టినదే ఈ బాగుండు బాగుండు..Love Failure Song. ఈ పాట 2021 సంవత్సరంలో యూట్యూబ్‌లో విడుదలై యువకుల మదిలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా నిజ జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి అబ్బాయి ఈ పాటను తప్పకుండా వినే ఉంటాడు. ఇక వారి స్టేటస్‌లలో ఈ పాట తప్పకుండా ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ పాట ఇప్పటికీ రోజుకు పదుల సంఖ్యలో చూస్తూనే ఉన్నారు.
బాగుండు బాగుండు సాంగ్ కు బుల్లెట్ బండి లక్ష్మణ్ లిరిక్స్ అందించడంతో పాటు డైరెక్షన్ చేశారు. సింగర్ రాము ఈ పాటకు ప్రాణం పోశాడు. ఎంత అద్భుతంగా పాడాడంటే పాట నాదే నా బాధే అన్నంతలా పాడి అభిమానుల గుండెలను టచ్ చేశాడు. ఇక కల్యాణ్ కీస్ సంగీతం పాటకు హైలెట్. ఎమోషనల్ సాంగ్‌కు తగ్గట్టుగా సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్‌లో అక్షిత్ మార్వెల్ (బాగుండాలమ్మా ఫేం), రౌడీ మేఘన, ప్రేమలత (టిక్ టాక్ ఫేం) మరియు భారతి పరమేష్ నటించారు.
అక్షిత్ మార్వెల్, రౌడీ మేఘన లవ్ ఫెయిల్యూర్ యాక్టింగ్ పాటలో చాలా బాగుంది. రౌడీ మేఘన తీసిన ఎన్నో సాంగ్స్‌లో కన్నా ఈ సాంగ్‌లో మరింత సహజంగా నటించారు. ఇక అక్షిత్ అయితే లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయి పాత్రలో నటించడం కన్నా జీవించారని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఈ పాటను చూసిన వారంతా ఇప్పటికీ కామెంట్లు పెడుతూనే ఉన్నారు.
Bagundu Bagundu song Credits:
Song Name | Bagundu Bagundu (2021) |
Writer & Direction | Laxman Bullettu Bandi |
Singer | Ramu |
Music | Kalyan Keys |
Cast | Akshith Marvel ( Bagundalamma fame ), Rowdy Meghana, Premalatha (Tik Tok fame), And Bharathi Paramesh |
Youtube Video song | link |
Bagundu Bagundu song Lyrics
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండున…
ఆ నాటి నవ్వులు నీ పెదవుల్లో లేవులే
ఆ నాటి చూపులు నీ కన్నుల్లో లేవులే
పాదాలేకందని…పసిపాపల ఉందువే
ఆ నాటి కల ఎటు పోయిందే….
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే
అద్దాల మేడలో…అందాల రాణిలా
ఉన్న నువ్వేనా సినబోయినవమ్మ
నిన్నే చూడాలని…మాటే కలపాలని
కలలెన్నో కంటు కనీళ్ళు కార్చుకున్న
నేరం నిదో నాదో నే భారం మోస్తుంది మనమే లే
పాపం చేసింది ఎవరోలే దూరం అయ్యింది మనమే లే
మనమిద్దరం ఒకటైపోయి ఉంటే
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే
కలిసిన మన రోజులు,చూపిన నీ ప్రేమలు
గురుతోస్తే కన్నుల్లో నీళ్ళు జారేనే
ఏడ్చిన ఏం లాభము, ఎదురుగా నువ్వు ఉండవే
ఈ జన్మకు నేను నిను చేరలేనులే..
ఆ దేవుని దీవెన మనకుంటే నీ జతలో తోడై నేనుంటే
దేవతల నిన్నే చూసుకొని నీ చితిలో తోడొచ్చేవన్ని
ఏడబాసై పోతిమి లే మనము
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే