Bagundi Bagunde: ఎన్నే లక్షల కోట్ల పాటలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని మనసుకు హత్తుకునే పాటలు మనసులోనే ఎప్పటికీ ఉండిపోతాయి. ఆ పాటలు మన ఆలోచనలకు తగ్గట్టుగానో, లేదా మన జీవితానికి సరిపోల్చే విధంగానో ఉన్నట్టు అనిపిస్తే ఆ పాట మన మనసులోని ఎప్పటికీ బయటకు పోదు.
అలాంటి పాటలు ఎక్కువగా ప్రభావితం చేసే వాటిల్లో Love Songs ఎక్కువుగా ఉంటాయి. ప్రేమ అనేది జీవితంలో చాలా అమూల్యమైనది, చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్క యువతీ యువకుడు దాని అనుభూతి పొందాలని తాపత్రయం పడుతూనే ఉంటాడు. ఇలాంటి సమయంలో తమకు నచ్చిన వారితో ప్రేమలో పాడి వారికి నచ్చినట్టుగా ఉంటూ వారి ఇష్టాలను మన ఇష్టాలుగా చేసుకుంటూ వారితోనే ఏడడుగులు నడవాలని ఆలోచించి ప్రేమించే వారు చాలా మంది ఉంటారు.
కానీ అలాంటి నిజాయితీ ప్రేమికుల జీవితాలు మధ్యలోనే కథ ముగిసిపోతుంటాయి. మనం నిత్యం చూసే సినిమాలు, పాటలు, నిజజీవితానికి చాలా ఆనుకొని ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం వచ్చిన తర్వాత తమ భావాలను వ్యక్త పర్చుతూ బాధపడేవారు చాలా మంది ఉన్నారు. Tony Kick , సోనీ వైష్ణవి కాంబినేషన్‌లో మున్న డైరక్షన్‌లో వచ్చిన లవ్ సాంగ్ బాగుందే బాగుందే పార్ట్ 2. ఈ సాంగ్ ను చాలా మంది ప్రేమికులు ఇష్టపడ్డారు. సినిమా పాటకు ఏ మాత్రమూ తగ్గకుండా ఒక స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
Bagundi Bagunde mp3 song
ఇప్పటికే ఎన్నో లవ్ సాంగ్స్ తో యూత్‌కు దగ్గరైన టోనీ కిక్ రోజు రోజుకూ తనలో ఉన్న ప్రతిభను పలు రకాల పాత్రలతో చూపించి ప్రేక్షకులను సొంతం చేసుకుంటున్నాడు. బాగుంది బాగుందే ఈ సాంగ్ రెండు పార్ట్‌లగా వచ్చింది. మొదటి పార్ట్ లో టోనీ కిక్ – మౌనిక డింపుల్ కలిసి నటించారు. ఈ పాటలో టోనీ కిక్ – సోనీ వైష్ణవి కలిసి నటించారు. ఈ రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. టోనీ కిక్ యాక్టింగ్ సినిమా హీరోలకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా ఉంది. తన హవాభావాలు తన ప్రేమను గెలిపించుకోవడం కోసం పడే తపన కన్నీళ్లు తెప్పిస్తుంటాయి.
ఈ పాటను యూట్యూబ్‌లో చూసిన ప్రతి ఒక్క ప్రేమికుడు, ప్రేమలో విఫలమైన వారు ఒకటికి పది సార్లు పాటను వింటూ వారి ప్రేమలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ పాట ప్రతి ఒక్క ప్రేమికుడికి కనెక్ట్ అయ్యింది. ప్రతిరోజూ ఈ పాటను వినేవారు చాలా మంది ఉన్నారు. ప్రేమకు కులము, మతము, ధనముతో సంబంధం లేదని మంచిగా ప్రేమించే గుణం ఉంటే చాలని ఈ పాటలో కళ్లకు కట్టినట్టు చూపించారు. తనను ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మాయి పడే తపన, తన కళ్లముందు తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే బాధపడే అబ్బాయి స్విచ్వేషన్లు చూస్తే కన్నీళ్లు ఆగవు.
బాగుంది బాగుందే పార్ట్ 2 love song Credits
Song | Bagundi Bagunde |
Director | Munna |
Music Director | Madeen Sk |
Lyrics | Rajender Konda |
Dop, Editing & Di | janatha Bablu |
Singers | Ramu & Divya malika |
SPL Thanks | Bullettu bandi Laxman & Rl team |
Youtube Song | Link |