Badude Badudu | NTR జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ కోశాధికారి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే Sriram Raja gopal తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరు ప్రతీ ఒక్క విషయంలో విఫలం చెందిందని విమర్శించారు. TDP ప్రభుత్వంలో ఇసుక ప్రజలకు ఉచితంగా లేక, మొత్తం ఖర్చు రూ.500 నుంచి రూ.వెయ్య వరకు ఉందని గుర్తు చేశారు. కానీ ఈ YCP ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ Sand రూ.5 వేల నుండి రూ.10 వేల వరకు ఉందని పేర్కొన్నారు.
ప్రజలపై ధరల భారాలు మోపి Badude Badudu
ఇసుక దొరక్క ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇసుక మీద ఆధారపడిన పలు రంగాల కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, ప్రతి సరుకుపై అధిక రేట్లు పెట్టి ఎప్పుడూ లేని విధంగా ప్రజలపై భారం మోపుతున్నారని పేర్కొన్నారు. RTC ఛార్జీల పెంపుతో Badude Badudu అని, విద్యుత్ ఛార్జీల పెంచి ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.J Brandsతో వారి సొంత మద్యం వారి బంధువుల ఫ్యాక్టరీలో తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాని మండి పడ్డారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.


కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల Telugu desam పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, గింజుపల్లి వెంకటేశ్వరావు, చింతా వెంకటేశ్వరరావు(బుల్లి), ముత్తవరపు చిన్నయ్య, నంబూరి కొండలు, చింతా సైదులు, జామా ఆనందరావు, గోగినేని శ్రీనివాసరావు, వడ్డే కృష్ణయ్య, వాగదాని శ్రీనివాసరావు, అయిలపొగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.