Badam Pappu: బాదంపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మంచింది. అదే విధంగా ధర విలువ కూడా ఎక్కువే. నానబెట్టిన బాదాంపప్పు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. బాదాంలో ఇ విటమిన్, ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలని బలంగా కూడా ఉంచుతాయి.
Badam Pappu: నానబెట్టిన బాదంపప్పు
బాదాంపప్పును నీళ్లలో నానబెట్టి తినాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బాదాంపప్పుపై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూర్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదే నానబెట్టి తింటే, జీర్ణక్రియ బాధల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గుప్పెడు బాదాంపప్పును అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటలపాటు నానబెట్టి ఆ తరువాత నీటిని ఒంచి, పై పొట్టును తొలగించి తినాలి. నానబెట్టిన బాదాంపప్పును ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు, గుండెను పదిలం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Badam Pappu ను తినడం వల్ల రక్తప్రసరణ సాధారణ స్థితిలోనే ఉంటుంది. అంతేకాదు.. శరీరానికి కావాల్సిన శక్తి, విటమిన్లు, మినరల్స్ ఇందులో దొరుకుతాయి. కొవ్వు శాతం లేకుండా చూసుకోవచ్చు. వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించాలను కుంటున్నారా? కనీసం ఆరు వారాల పాటు బాదం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాదం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీంతో పొట్ట చుట్టుకొంత తగ్గుతుంది అని చెబుతున్నారు. రోజూ బాదం తినే వారికి చెడు కొలెస్ట్రాల్ 40 శాతం తగ్గుతుందని లూసియానా స్టేట్ యూనివర్శిటీకి చెందిన అధ్యయన కర్తలు చెబుతున్నారు.
స్నాక్స్ బదులు!
రెండుపూటలా తీసుకునే భోజనం కాకుండా, మధ్యమధ్య స్నాక్స్ తినాలనిపించేవారు దోరగా వేయించిన బాదం తిని చూడండి. వాటివల్ల పొట్ట నిండుతుంది. రక్తంలో చక్కెరస్థాయులు కూడా ఓ క్రమపద్ధతిలో సాగుతాయి. టైప్ 2 మధుమేహం ఉన్నవాళ్లు రోజూ మూడునెలల పాటు బాదం (Badam Pappu) తినడం వల్ల శరీరంపై పడే ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యల్ని తగ్గించుకోవచ్చని చైనాకు చెందిన అధ్యయనకర్తల బృందం వెల్లడిస్తోంది.
గర్భదారణ సమయంలో బరువు పెరుగుతారు. కొన్నిసార్లు అది మధుమేహం, అధికరక్తపోటుకి దారి తీస్తుంది. నవ మాసాల సమయంలో ఇలాంటి సమస్యలు రాకుండా బాదం తీసుకోవడమే పరిష్కారం అంటున్నారు క్యాలిఫోర్నియాకు చెందిన అధ్యయనకర్తలు.
అందానికి బాదం!
బాదం నూనెతో రోజూ ఉదయం 10 నిమిషాలు మర్ధన చేసుకుంటే ముఖంపై నలుపు, ఎరుపు మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. కళ్లకింద ఉబ్బు తగ్గాలంటే బాదం నూనెను వేళ్లతీ తీసుకుని, సున్నితంగా మసాజ్ చేసుకుంటే ఉబ్బుతోపాటు నల్లని వలయాలు కూడా తగ్గుతాయి. ఎండకు నలుపు అయ్యే భాగంలో చర్మం కమిలినట్టుగా తయార వుతుంది. కొందరికి దురద కూడా వస్తుంటుంది.

ఇలాంటివారు రాత్రి పడుకునే ముందు బాదం నూనెతో ఓ పదినిమిషాలు మసాజ్ చేసుకుని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మ సమస్యలు తగ్గటమేగాక చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. నానబెట్టిన బాదంపప్పులను మెత్తగా పేస్టు చేసి అందులో కొద్దిగా పచ్చిపాలను కలిపి ముఖానికి ప్యాక్ చేసి, 15 నిమిషాల తర్వాత కడుక్కుంటే పొడిచర్మం ఉన్నవారి ముఖం నిగనిగలాడుతుంది.