Gbaby ear piercing studsపిల్లలకు సంబంధించిన అపురూపమైన వేడుకల్లో చెవులు కుట్టించడం కూడా ఒకటి. అది పెద్దలకు వేడుకే కానీ, పిల్లలకు మాత్రం నొప్పి పుట్టించే పని. చెవులు కుట్టించేటప్పుడు తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే చెవులకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
-పిల్లలకు చెవులు కుట్టించడానికి ముందు వారికి తలస్నానం చేయించాలి. తరువాత ఓ వారంపాటు చెవులపై నీళ్లు పడకుండా జాగ్రత్తగా స్నానం చేయించాలి. వీలైనంతవరకూ చెవులకు చల్లటి నీళ్లు తగలకుండా చూడాలి. అలానే కొన్నాళ్ల పాటు స్టడ్స్ లేదా చిన్న చిన్న రింగుల్లాంటివి(baby ear piercing studs)పెట్టాలి. నొప్పి తగ్గి చెవి రంధ్రం కాస్త పెద్దది అయ్యాక వేలాడేవి పెట్టొచ్చు.
-చెవులు కుట్టించిన మొదటి రెండు మూడు రోజులు చిన్నారులకు తలమీదుగా వేసే దుస్తులు కాకుండా ముందువైపు గుండీలు పెట్టుకునేవి ఎంచుకుంటే మంచిది. వారికి పెట్టిన రింగులూ, చిన్న స్టడ్స్ ఏవైనా సరే.. దుస్తులకు పట్టుకోకుండా ఉంటాయి.
-చర్మ సున్నితంగా ఉన్నవారికి కొన్నిసార్లు చెవుల దగ్గర చీము పట్టొచ్చు. అలాంటప్పుడు దూదితో తుడిచి కొబ్బరి నూనెతో మర్దన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. సమస్య పెరగకుండా ఉంటుంది.


-మరీ పసిపిల్లలకు కుట్టించినప్పుడు వాళ్లకు తెలియక చెవుల్నీ, చెవులకు పెట్టిన కమ్మల్ని లాగేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా బలంగా చేసినప్పుడు గాయం కావచ్చు. అందుకే వారిని ఓ కంట కనిపెట్టడం తప్పనిసరి. కొన్నిసార్లు పిల్లలకు రాగితో కుట్టించినప్పుడు అది పడక చీము పట్టొచ్చు. అలాంటిది గమనిస్తే దాన్ని వెంటనే తీసేయడం మంచిది. పడే లోహాన్నే ఉపయోగించాలి.
- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!