Babu Jagjivan Ram History : వివక్షను జయించిన జగ్జీవన్ | జీవితాంతం అవమానాలే!
డిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు
Babu Jagjivan Ram History :ఒక దశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగిన సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) అని తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు కొనియాడారు. బాబూ జగ్జీవన్ రామ్ 113 వ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు.


‘అంటరాని’ కుండలు పగలకొట్టిన వీరుడు!
జగ్జీవన్ రామ్ బీహార్ లోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5న శోభిరామ్, బసంతి దేవీలకు జన్మించారన్నారు. ఆయన చదువుతున్న పాఠశాలలోనే తొలిసారి అంటరాన్ని తనాన్ని అనుభవిం చారని చెప్పారు. పాఠశాల విద్యార్థలు కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందీ పానీ’, ‘ముస్లీం పానీ’ అని రాసి ఉంచారని అయితే జగ్జీవన్ రామ్ హిందూ పానీలో మంచి నీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలో నీరు త్రాగేవారు కాదని తెలిపారు. ఈ ఉదంతంలో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కలు ముక్కలుగా చేశారన్నారు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’, అనే మరో కుండను ఏర్పాటు చేయడంతో జగ్జీవన్ రామ్ ఆ కుండను కూడా పగులగొట్టారన్నారు. ఇక చేసిదేమీ లేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటు చేశారని తెలిపారు.
అవమానాలు, ఆటంకాలే ముందుకు నడిపాయి!
జగ్జీవన్ రామ్ గెలిచినా ఆయన గుండె అవేదతోనూ, కోపంతోనూ నిండిందని ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతి వైపు ముందుకు సాగడానికి ప్రేరణ ఇచ్చాయన్నారు. ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేయగలిగారన్నారు. అంతటి కష్ట కాలంలో కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం ఆయనకే చెల్లిందన్నారు. 52 ఏళ్ల పాటు పార్లమెంట్ ను ఏలిన మహా అనుభవ శీలి, వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైలేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయమన్నారు.


లాఠీ దెబ్బలకు బెదరని గుండె!
1930 లో గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమం చేస్తుండగా దానికి జగ్జీవన్ రామ్ ఆకర్షితుడయ్యారన్నారు. ఆ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్ పోలీసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డారని తెలిపారు. వివక్షను ఎదుర్కొంటూ ఉప ప్రధాని స్తాయికి రావడం జగ్జీవన్ రామ్ అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమ శిక్షణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన 1986లో జూలై 6న పరమపదించారన్నారు.
దళిత హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలు చేయడానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు. అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న నిజమైన దేశ నాయకుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ డివిజన్ కార్యదర్శి తడికమళ్ల యోబు, కొత్తపల్లి కుమార్, జీవన్, గిరి, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started