Baba Ambedkara Saichand Song | జై భీమ్..అద్భుతమైన అంబేద్కర్ గారి పాటను Saichand సాంగ్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా సాయిచంద్ అన్న ఆధ్వర్యంలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. Baba Ambedkara మన భారత భాస్కరా అంటూ ప్రాణం పెట్టి పాడారు సాయిచంద్ అన్న.
ఈ పాటలో డా.బిఆర్. అంబేద్కర్ గారు పడిన బాధలు, కష్టాలు అన్నింటిని అర్థమయ్యే రీతిలో పాట రూపంలో తీసుకురావడం ఒక గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. ఈ విషయంలో సాయిచంద్ కు ప్రతి ఒక్కరం ధన్యవాదాలు తెలపాలి. పాటకు సంగీతం మరింత ఆకట్టుకుంది. ఇప్పటి వరకు వచ్చిన అంబేద్కర్ పాటల్లో ఈ పాట Evergreenగా నిలుస్తుంది. ఈ పాటను చూసిన, విన్నవారంతా నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను Video చూడాలంటే కచ్చితంగా కింద Link ఇస్తాము చూడండి.
Baba Ambedkara Saichand Song Lyrics
మీ తెలివి …..మీ సహనం ….మీ త్యాగం….మీ సాహసం
లేకుంటే ……..మేము ఏనాడో
బుగ్గయ్ పోతుంటిమో
ఈ భరత భూమిలొనే మసి బొగ్గయ్ పోతుంటిమో
ఏమిస్తే తీరునయ్య నీ రుణము
మేము ఎం చేస్తే తీరునయ్య నీ ఋణమూ
మీ బొమ్మ పెడితే తీరునా
మీకు దండలేస్తే తీరునా
నీ జెండాలెగరేస్తే తీరునా…
మీరు రాసిన రాజ్యాంగమనుసరించి
ఆ పార్లమెంట్ నుండి….పంచాయితీ ఆఫీసు దాకా
కుర్చీల కూసుంటే తీరునా…
రాజ్యపు పగ్గాలను చేపడితే తీరునా
బాబా అంబెడ్కరా ….మా బడుగులకు భాస్కరా
బాబా అంబెడ్కరా ….మన భారత భాస్కరా
మీరే లేకుంటే మేమై పోతుంటిమో…?
మీరే రాకుంటే మెమెట్ల బతుకుతుంటిమో?
భీమభాయ్ కడుపున మీరు పుట్టకపోయుంటే
మీ తండ్రి రాంజీ మిమ్ము బడికి పంపకుంటే
బడి నిను వెలివేసిందని కృంగిపోయిఉంటే
అవమానంతో భారంతో ఆగిపోయిఉంటే
జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగక పోయుంటే
భారత మాత పుత్రుల బతుకులు మారాలని
భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే
బాబా అంబెడ్కరా మా బడుగులకు భాస్కరా
మీరే లేకుంటే మేమై పోతుంటిమో
మీరే రాకుంటే మెమెట్ల బతుకుతుంటిమో
మనుస్మృతి ని మంటల్లో కాల్చకపోయుంటే
మనువాదపు మకిలి మీరు కడగక పోయుంటే
కుల రక్కసి పై యుద్ధం మొదలు పెట్టకుంటే
ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే
సమానత ను కోరి మీరు ముందడుగే వేయకుంటే
జ్యోతిరావు పూలే అడుగుజాడ నడవకుంటే
వెలివాడల కొరకు మీరు వెలుగై రాకుంటే
బాబా అంబెడ్కరా మా బడుగులకు భాస్కరా
మీరే లేకుంటే మేమై పోతుంటిమో
మీరే రాకుంటే మెమెట్ల బతుకుతుంటిమో
ఈ భరత అవనిపై మీరు జనించక పోయుంటే
మన దేశానికి మీ బతుకు ధారపోయకుంటే
ఆ చెరువు నీళ్లు మీరు గనక ముట్టకపోయుంటే
కులం అహంకారులకు సవాల్ ఇసరకుంటే..
వజ్రాయుధమంటి ఓటు హక్కునివ్వకుంటే
మనుషులంత ఒక్కటనే మార్గ మేయకుంటే
బాబా అంబెడ్కరా మా బడుగులకు భాస్కరా
మీరే లేకుంటే మేమై పోతుంటిమో
మీరే రాకుంటే మెమెట్ల బతుకుతుంటిమో
Writen by – SAICHAND (9550778717)
Lyrics & Singing by: Saichand Maurya
Music: Prashanth BJ
Editing: Akashavani Prabhu
బాబా అంబేద్కరా Saichand Song వీడియో లింక్ క్లిక్ చేయండి!