Ayyagare No1 | ప్రస్తుతం ఒక Cinema హిట్ అవ్వాలంటే, థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించాలంటే కచ్చింతంగా అభిమానుల ఆశీస్సులు హీరోలకు ఎప్పుడూ ఉండాల్సిందే. హీరో రేంజ్ మరింత పెరగాలన్నా, తగ్గాలన్నా అది కేవలం అభిమానుల చేతుల్లోనే ఉంది. తమకు నచ్చిన Hero సినిమా వచ్చిందంటే ఒక పండగలాగా ఫీలయ్యేది ముందుగా అభిమాని ఒక్కడే. అలాంటి అభిమానులు ఇండియాలో కోట్లలో ఉన్నారు. కానీ హీరోలు మాత్రం ఒక్కసారిగా Craze వచ్చిన తర్వాత కనీసం అభిమానులతో ఫొటో కూడా దిగకుండా వారిని నిరుత్సాహ పరుస్తున్న సన్నివేశాలు మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయినప్పటికీ స్వార్థం లేని Fan మాత్రం చిన్న చిరునవ్వుతో మరిచిపోయి తన హీరోను ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాడు.
Akhil Fan Nagaraju | Ayyagaru
ప్రస్తుతం హీరో అయ్యాక అభిమానులు పుట్టుకొస్తారు. కానీ ఒకే ఒక్క అభిమానితో మాత్రం ఆ హీరో క్రేజ్ ఆకాశాన్ని అంటింది. అప్పటి వరకు ఆ అభిమానిని ఎవరూ పట్టించుకోలేదు. అతని అభిమానంతో ఏకంగా హీరో క్రేజ్ పెరగడంతో ఇప్పుడు ఆ అభిమానిని పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఆ అభిమానిని కలవాలని హీరో అనడం అభిమానుల ఆత్మభిమానాన్ని అర్థం చేసుకున్నట్టయ్యింది. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే యువసామ్రాట్, కింగ్ నాగార్జున చిన్న కొడుకు Hero Akil.
వరుస సినిమాలతో రానిస్తున్నప్పటికీ అకిల్‌కు అంత క్రేజ్ రాలేదు. కనీసం నాగార్జున కొడుకు అయినప్పటికీ స్టార్‌డమ్ సొంతం కాలేదు. కానీ ఒక్క అభిమానితో మాత్రం అకిల్ పేరు మారుమోగ్రింది. తెలుగు సినిమా చరిత్రలో అభిమానితో క్రేజ్ వచ్చిన హీరోగా అకిల్ నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం Guntur జిల్లా కు చెందిన Nagaraju అనే వ్యక్తి Akkineni కుటుంబానికి వీర అభిమాని. అంతే కాకుండా అక్కినేని అకిల్‌కు డైహార్ట్ ఫ్యాన్ అని కూడా చెప్పవచ్చు.
కొద్ది నెలల కిందట Akil సినిమా విడుదలైన సందర్భంగా గుంటూరు పట్టణంలోని కీర్తన పల్లవి థియేటర్స్ వద్ద నాగరాజు అనే అభిమాని మీడియాతో మాట్లాడిన వీడియో తెగ వైరల్ అయ్యింది. Ayyagare No1 అంటూ అకిల్ రావాలి అంటూ కొనసాగిన తన అభిమానం నెట్టింట్లో అని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం మీద కోట్ల మంది చూసేలా వైరల్ అయ్యింది. అక్కినేని అకిల్‌పై తనకు ఉన్న స్వార్థం లేని అభిమానం ఇప్పుడు అతన్ని ఒక సెలబ్రెటీ అభిమానిగా మార్చేసింది.


తన కోసం అభిమాని చేసిన ఒక్క చిన్న వీడియో Viral కావడంతో అక్కినేని అకిల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాకు ఆ అభిమాని వల్ల క్రేజ్ పెరిగిందని స్వయంగా చెప్పారు. నేను అతన్ని తప్పకుండా చూడాలి, కలవాలని ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. నన్ను ఇంతలా అభిమానించిన ఆ ఒక్క అభిమాని ఎప్పుడూ బాగుండాలని చాలా సంతోషంగా చెప్పారు. తన నిజాయతీ గల అభిమానంతో నాగరాజు ఇప్పుడు ఒక హీరోను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అభిమాని తలుచుకుంటే సినిమా వాళ్లను హీరోలను చేస్తారు. వాళ్లను తిరస్కరిస్తే జీరోలను కూడా చేస్తారు. ప్రతి ఒక్క హీరో ఈ విషయం తెలుసుకొని అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కాస్త ఒక సెల్ఫీకైనా సమయం ఇచ్చి వారి ఆనందాన్ని పంచుకుంటే ఆ హీరోకు ఎప్పటికీ తిరుగుండదని అభిమానులు నిరూపిస్తున్నారు.
Ayyagare No1 : అభిమాని సందడి చేసిన వీడియో చూడాలంటే లింక్ క్లిక్ చేయండి!