ayurvedic treatment after delivery : మాతృత్వం ప్రతి స్త్రీకి భగవంతుడిచ్చిన అద్భుత వరం. కానీ ఒకసారి గర్భం వచ్చాక, ప్రసవం తర్వాత స్త్రీ తన శరీర సామర్థ్యాన్ని, సౌకుమర్యాన్ని, సౌందర్యాన్ని, లాలిత్యాన్ని కోల్పోయి ఒళ్ళు వచ్చి, పొట్ట జారి, స్తనాలు Breasts, సడలి, నడుం పెద్దదై తన పూర్వపు యవ్వన సౌరభాన్ని కోల్పోయినట్టు అనిపిస్తుంది.
అలాగే రాత్రి తన ముడతలు పడ్డ పొట్ట ఆపరేషన్ ప్రసవం కారణంగా పడ్డ కుట్లు, మచ్చలు కొట్టొచ్చినట్టు కనిపించి బాధ అనిపిస్తుంది. అందుకే ఆ అందం సడలకుండా, ఆ ముడతలు లేకుండా, పొట్ట బరువు పెరగకుండా నడుం నిలకడగా ఉంచుకోవడానికి ఆయుర్వేద ayurvedic treatment, ఆచార్యులు చక్కటి సంరక్షణ ప్రతిపాదించారు. అదే సూతికా పరిచర్య. ఈ సూతికా కాలాన్ని పోస్ట్ పార్టమ్ అంటారు ఆధునికులు.
ప్రసవం అయ్యాక After Delivery, తొలి 40 రెండు రోజులని సూతికా కాలం లేదా పోస్ట్ పార్టమ్ పీరియడ్ Post partum, అంటారు. ఈ కాలాన్ని చక్కగా సంరక్షించుకోవడం అటు తల్లికి, ఇటు శిశువుకూ కూడా ప్రయోజనకరం. అంతేకాదు ముఖ్యమైనది కూడా. ఈ కాలంలో తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలు ఆమె భవిష్యత్తు శోభాయమానంగా ఉండటానికి, శిశువు ఆరోగ్యవంతంగా పెరగటానికి దోహదపడుతుంది.
ayurvedic treatment after delivery: నలభై రెండు రోజులు చాలు
పది నెలలు మోసి, ఆ కాలంలో ఎన్నో ఒడుదుడుకులు పడి చురకత్తి కోతలాంటి ప్రసవంలో ఒక కొత్త ప్రాణికి జన్మనిచ్చిన తర్వాత ఆ శరీరం, మనస్సు, గుండె, హార్మోన్లు, చర్మం, ముఖం, చివరికి ఆత్మ సాధారణ స్థితిని చేరుకోవడం సహజపరిణామైనా మనం తీసుకునే జాగ్రత్తలు మరింత దోహదపరుస్తాయి. ఈ అవస్థలో ఏమాత్రం హెచ్చుతగ్గులు జరిగినా, స్త్రీ గర్భాశయంలో లోపాలు, హార్మోన్లలో తేడాలు, అయితే బలక్షయం లేదా అధిక బరువు పెరగడం స్త్రీ జననేంద్రియాల వ్యాధుల రావడానికి అవకాశం ఉంది.
సూతికా కాలంలో మన జాగ్రత్తలు అంటే – కాస్త విశ్రాంతిగా ఉంటే సహజ పరిణామంలోనే అంతకు ముందు గర్భిణీకాలంలోనూ, తీవ్రమైన ప్రసవవేదనలోనూ సంక్షుభితమైన అవయావాలన్నీ సాధారణ స్థితిని చేరుకుంటాయి. ఆ కాలంలో కారు నడపటం, స్కూటరు డ్రైవ్ చేయడం, ఆటలలో గెంతటం మానేయడం మంచిది. ఆ సమయంలో After Delivery, బయట స్నేహితుల వద్దకు వెళ్లడం, ఇంట్లో ఎక్కువ సేపు బయట స్నేహితులతో గడపడం తగ్గించడం మంచిది. ఎందుకంటే వాళ్ళ నుండి ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది.
ఈ కాలంలో తల్లి కాస్త జాగ్రత్తపడితే తనకి, తన బిడ్డకి వచ్చే కడుపుబ్బరం, కడుపునొప్పి, నిద్ర రాకపోవడం, చికాకుగా ఉండటం, నిర్లిప్తత వంటివి రావు. ఈ సూతికాపరిచర్య వల్ల తల్లి తన భవిష్యత్తులో ఎదురయ్యే శారీరకపరంగా, మానసికపరంగా ఒత్తిడిని తట్టుకునే శక్తి, ఆత్మశక్తి, దైవబలం సమకూర్చుకోగలుగుతుంది.
సున్నితంగా మసాజ్
తొలి మూడు నుండి ఏడు రోజులు దాకా గోరు వెచ్చని నువ్వుల (Sesame) నూనెతో పై నుండి కిందకి పొట్టపైన, నడుంపైనలో తొడలలో సున్నితమైన మసాజ్ చేసుకోవడం హితకరం. మొదటి మూడు రోజులు వేయించిన బియ్యంతో వండిన తేలికైన అన్నం తినడం మంచిది. ఏడవ రోజు నుండి వీలైతే జీర్ణద్రవ్యాలతో కలిపి వండిన మాంసరసం ఇవ్వడం మంచిది. అక్కడి నుండి పల్చని వెడ ల్పయిన మెత్తటి గుడ్డతో పొట్ట, నడుం బిగించి కట్టుకోవడం చాలా మంచిది. దీన్ని నడికట్టు అంటారు.
సూతికా కాలంలో తల్లి వేడినీళ్ళతో స్నానం చేయాలి. కోపం, వ్యాయామం, అధికమైన శారీరక కష్టం ముఖ్యంగా భర్తతో సంభోగం మానేయాలి. ఈ కాలంలో పెద్దవాళ్ళు ముఖ్యంగా ప్రేమించే తల్లి. మేనత్తలు ఆమెని ఉత్సాహపరుస్తూ బిడ్డ పెంపకం, పాలివ్వడం, బిడ్డ ఏడిస్తే కంగారుపడకుండా చూడటం లాంటివి తల్లికి ఊరటనిస్తాయి. మొదటి 2-3 వారాలు మాంసాహారం మానేయడం మంచిది. ఆ కాలంలో గుడ్డు, పచ్చికూరలు, ఎండిన పళ్ళు, ఆరిపోయిన ఆహారం, ఎక్కువసార్లు కాఫీ తాగడం మంచిది కాదు.
ayurvedic treatment: ఇవి పాటించండి.
తల్లీపిల్ల ఇద్దరూ ఎప్పుడూ వేడిగా స్నిగ్ధంగా ఆహ్లాదంగా వుండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ నువ్వుల నూనెతో శరీరమంతా తేలిగ్గా మర్దన చేసుకొని వేడినీళ్ళతో స్నానం చేయడం తల్లికీ, బిడ్డకు మంచిది. అలాగే నడుమకుకి, పొట్టకి బలాతైలం కొద్దిగా వేడిచేసి సాయంకాలం సున్నితంగా మర్దన చేసుకుంటే నడుము బలం పెరిగి, సడలిన పొట్ట బిగుతైవుండటానికి దోహద పడుతుంది. తల్లి ఆహారం నువ్వల నూనెతో కాని, నేతితో కాని తీసుకోవడం చాలా మంచిది. తల్లి సూతికా కాలంలో రోజూ కొద్దిసేపైనా బోర్లాపడుకోవడం చాలా మంచిది.
పిప్పల, ధనియాలపొడి, జీలకర్ర, అల్లం, మిరియాల పొడి, సైంధవ లవణంతో కూడిన బియ్యపు జావ తాగడం చాలా ఉపకరిస్తుంది. ఇది తల్లి జీర్ణశక్తిని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సమయంలో కృస్నబల ఒక గ్రాము తీసుకొని బెల్లంతో రోజుకు రెండు సార్లు తీసుకుంటే, గర్భాశయం శుద్ధి పొంది ఆరోగ్యంగా ఉంటారు. ఈ సూతికా కాలంలో దశమూలారిష్ట రోజూ ఒక ఔన్సు చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవడం అవసరం. గర్భిణీ కాలంలో పెద్దదైన గర్భాశయం సహజంగానే మామూలు స్థితికి రావాలి. అది చక్కగా రావడానికి పిప్పలీమూలం, రెండు గ్రాముల నెయ్యితో కలిపి ఏడు రోజులు ఇస్తే మంచిది.
పచ్చి వంకాయలు నూరి, రెండు చిటికెలు కర్పూరం కలిపి తేనెతో కలిపి ముద్దని యోనిపైన రాసుకుంటే ప్రసవం After Delivery, తర్వాత వదులైన యోని vagina, గట్టిపడుతుంది. ఈ కాలంలో స్నానమైన తర్వాత ఒంటికి, తలకి అగరుధూపం వేసుకోవడం మంచి సౌందర్య సాధనం. శతావరీ కల్ప, అశ్వగంధ లేహ్యం, శతాశరీఘృతం తీసుకుంటే మంచి మందులు, ప్రసవం తర్వాత మన ధ్యేయం తిరిగి పూర్వసౌష్టవం పొందాలని ప్రయత్నించండి.