Ayurveda benefits Telugu | మానవుడి పుట్టక పూర్వం నుంచే ఆయుర్వేద వైద్యం అందుబాటులో ఉంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో ఆయుర్వేదానికి పెద్ద పీట వేశారు మన గురువులు, ఋషులు. ఆయుర్వేద వైద్యంతో ఆరోగ్యం ఎల్లప్పుడూ క్షేమంగానే ఉంటుంది. ఇంగ్లీష్ మందులు వాడి వాడి చివరకు ఆయర్వేద వైద్యంతో పెద్ద పెద్ద రోగాలు నయం అయిన ఘటనలు భారతీయ వైద్య శాస్త్రంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యం గురించి తెలుసుకుంటే ఇంటిలోనే తయారు చేసుకొని ఆరోగ్యాన్ని (Ayurveda benefits Telugu) కాపాడుకోవచ్చు.
ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం!
అతి బరువు ఉన్న వారు తులసి ఆకులను పెరుగు లేక మజ్జిగతో కలిపి తాగితే బరువు తగ్గుతారు. తెల్ల వెంట్రుకలు ఉన్న వారు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ మూడింటి బెరడు, నీలి ఆకు, లోహ చూర్ణము వీటిని సమభాగాలుగా గుంట గలగలగర నిజరసము, జీలకర్ర రసము, గొర్రె మూత్రం కలిపి మెత్తగా దంచి రోజూ ఉదయం లేక సాయంత్రం తలకు రాసుకొని దట్టముగా లేపనం చేసి 2 నుంచి 3 గంటల తర్వాత కుంకుడు శీకాకాయలతో తలస్నానం చేస్తే తెల్లవెంట్రుకలు క్రమంగా తగ్గిపోతాయి. పులిపిర్లు తగ్గడానికి ఉత్తరేని ఆకు, హరి చందనమును నువ్వుల నూనెతో కలిపి మెత్తగా నూరి పులిపిర్లపై లేపనం చేయాలి.
శరీరం బిగువుగా ఉండేందుకు మేడి పాలు, మర్రిపాలు నువ్వుల నూనెతో కలిపి కాచి శరీరానికి మర్దన చేయాలి. వెంట్రుకలు ఊడకుండా ఉండేందుకు మినుములు, మెంతులు, ఉసిరిక సమంగా తీసుకుని నానబెట్టి రుబ్బి తలకు పెట్టుకోవాలి. ఆరిన తర్వాత కుంకుడు రసంతో స్నానం చేయాలి. అలా చేసిన తర్వాత మూడు రోజుల్లోనే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అధిక కొవ్వు తగ్గేందుకు ఆవనూనెతో మర్ధన చేస్తే తగ్గుతుంది. తలలో పేలు పోయేందుకు సుగంధ పాల వేళ్లను గోముత్రంలో కలిపి మెత్తగా నూరి తలకు లేపనం చేస్తూ ఉంటే తలలోని పేలు చచ్చిపోతాయి.
ఆయుర్వేద చిట్కాలు
జుట్టు రింగులు తిరగాలంటే రాత్రి పడుకోబోయే ముందు తలకు ఆముదం రాసి జుట్టుకు పక్కకు దువ్వాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత పక్కకు తిరిగిన జుట్టును వెనుకకు కూడా దువ్వుకొన వచ్చును. కుంకుడు రసం తోనే తలస్నానం చేయాలి. షాంపూ, సబ్బులు వాడ కూడదు. మొటిమలు పోవాలంటే సుగంధి పాల వేళ్ల బెరడు చూర్ణము, పెసర పిండి, హారతి కర్పూరం ఈ మూడు సమభాగాలుగా కలిపి ఈ చూర్ణంతో ముఖానికి నలుగు పెట్టుకుంటూ ఉంటే, ముఖం మీద మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. సుగంధ పాల వేళ్ల చూర్ణము, వస చూర్ణము, ధనియాల చూర్ణము ఈ మూడింటినీ సమభాగాలుగా కలిపి నీటితో మెత్తగా నూరి ముఖానికి రాస్తూ ఉంటే మొటిమలు మచ్చలు హరించి పోతాయి.

చుండ్రు తగ్గాలంటే 90 వేపాకులు, 9 మిరియాలు కలిపి కొంచెం నీళ్ళు కలిపి మెత్తగా నూరి, తలకు, ఒంటికి పట్టించుకోవాలి. సరిపోకపోతే మరికొంత కలుపుకోవచ్చు. ఆరిపోగానే కుంకుడు కాయరసంతో స్నానం చేయాలి. వేపాకులు మిరియాల సంఖ్య కరెక్టుగా ఉండాలి. నల్లమచ్చలు పోవాలంటే ఆముదం గింజలు 225 తీసుకుని పై పెచ్చులు తీసివేసి, లోపలి పప్పులో 12 గ్రాం శొంఠి పొడి కలిపి మెత్తగా నూరి, కుంకుడు గింజలంత టాబ్లెట్స్ చేసి, నిలువ ఉంచుకొని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల మంచి నీళ్లతో వేసుకుంటూ ఉంటే 2,3 నెలల్లో నల్ల మచ్చలన్నీ నామ రూపాల్లేకుండా పోతాయి. వళ్లు తగ్గడానికి వాని నీటిని ఆకాశం నుండి పడేటప్పుడు నేల మీద పడకుండా పట్టుకుని నిలువ వుంచి రోజు ఉదయం పూట 50 గ్రాం వాన నీటిలో చిటికెడు మంచి పసుపు కలిపి తాగుతుంటే 3 నెలల్లో స్థూలశరీరం తగ్గిపోతుంది.
(నోట్: పైన తెలిపిన ఆయుర్వేద పద్ధతులు పూర్వం గ్రంథాల నుంచి సేకరించినవి, కేవలం అవగాహన కోసం మాత్రమే).
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!