Ayudha Pooja 2022: ద‌స‌రాకు ముందు ఆయుధ పూజ చేస్తారెందుకు?

Ayudha Pooja 2022: భార‌త దేశం పండుగ‌ల సంస్కృతికి పుట్టినిల్లు. కులాలు, మ‌తాలను ప‌క్క‌న పెట్టి ప్రతి ఒక్క‌రూ పండుగ‌లో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా పాల్గొంటూనే ఉంటారు. ఒక‌రికొక‌రు శుభాకాంక్ష‌లు తెలుపుకుంటారు. రేపు #ద‌స‌రా పండుగ‌ (అక్టోబ‌ర్ 5, 2022) సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముఖ్యంగా మ‌హిళ‌లు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ప్ర‌తిఒక్క ఇంటిలో ఆయుధ పూజ కూడా చేస్తున్నారు.

Ayudha Pooja 2022 | ఆయుధ పూజ అంటే ఏమిటి?

ద‌స‌రా పండుగ‌కు ఒక్క‌రోజు ముందు వ‌చ్చే పండుగ‌నే ఆయుధ పూజ అంటారు. దేవీ న‌వ‌రాత్రుల వేడుక‌లు సంద‌ర్భంగా ఈ #ఆయుధపూజ‌ కు గొప్ప ప్ర‌త్యేక‌త ఉందని చెప్ప‌వ‌చ్చు. తాత‌ల‌,తండ్రుల నుండి వ‌స్తున్న ఈ ఆచారాన్ని హిందువులు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఈ పండుగ విశిష్ట‌త‌ను పాటిస్తారు. ప్ర‌తి ఒక్క హిందూ కుటుంబంలో చాలా మంది వారి ప‌నిముట్ల‌ను, ఇత‌ర సామాగ్రిని దుర్గా మాత ద‌గ్గ‌ర ఉంచి పూజ‌లు చేస్తారు.

సాధార‌ణంగా ప‌ల్లెటూర్ల‌లో అయితే వ్య‌వ‌సాయానికి వినియోగించే కొడ‌వ‌లి, నాగ‌లి, ఇత‌ర వాహ‌నాల‌కు, వృత్తి ప‌రంగా అయితే టైల‌ర్లు, చేనేత కార్మికులు, పోలీసు స్టేష‌న్ల‌లో, పెద్ద‌పెద్ద క‌ర్మాగారాలలో ఉండే ఇనుప వ‌స్తువుల‌కు ప‌సుపు, కుంకుమ‌తో ఆయుధ పూజ చేసి దేవ‌త ఎదుట ఆరాధిస్తుంటారు. దేశంలో ద‌స‌రా పండుగ వ‌చ్చిన ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ ఆయుధ పూజ చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది.

ఆయుధ పూజ‌

పాండ‌వుల క‌థ‌!

మ‌న పురాణాల ప్ర‌కారం పాండ‌వులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ యుద్ధానికి ముందు జ‌మ్మిచెట్టు మీద వారి ఆయుధాల‌ను, యుద్ధ‌సామాగ్రిని భ‌ద్ర‌ప‌రిచారు. అర్జునుడు గాండీవంతో పాటు భీమ‌సేనుని గ‌దాయుధానికి యుద్ధానికి వెళ్ల‌డానికి ముందు ప్ర‌త్యేకంగా పూజ‌లు జ‌రిపించార‌ట‌. అలా వారు శ‌క్తి స్వ‌రూపిణిని ప్ర‌స‌న్నం చేసుకుని పాండవులు యుద్ధానికి సిద్ధ‌మ‌య్యార‌ని చ‌రిత్ర చెబుతోంది. మ‌రో ప్ర‌చారం ఏమిటంటే దుర్గ‌తుల‌ను నివారించే మ‌హా స్వ‌రూపిణి అమ్మ‌వారైన #దుర్గాదేవి దుర్గ‌ముడు అనే రాక్ష‌సుడిని సంహ‌రించిన రోజు అని చెబుతారు.

ఆయుధ పూజ (Ayudha Pooja 2022) నేప‌థ్యం ఏమిటంటే శ‌త్రు భాత‌లు తొలుగుతాయ‌ని అర్థం. పంచ‌ప్ర‌కృతి మ‌హా స్వ‌రూపాల‌లో దుర్గాదేవిది మొద‌టి స్థానం. భావ‌బంధాల్లో చిక్కుకున్న వ్య‌క్తుల‌ను అమ్మ‌వారు అనుగ్ర‌హించి మోక్షం ప్ర‌సాదిస్తుంద‌ని న‌మ్మ‌కం. కోటి సూర్య ప్ర‌భ‌ల‌తో వెలుగొందే అమ్మ‌వారిని ద‌స‌రా పండుగ ముందు రోజు స్మ‌రించుకుంటే శ‌త్రు బాధ‌లు తొలిగిపోతాయ‌ని న‌మ్మ‌కం.

ఆయుధ పూజ మంత్రం ఏమిటి?

ఆయుధ పూజ‌ (Ayudha Pooja 2022)కు ఒక మంత్రం కూడా ఉంది. ‘ఓం దుం దుర్గాయైన‌మః..’అనే మంత్రాన్ని ప‌ఠించ‌డం ద్వారా శుభ‌ప్ర‌ద‌మైన ఫ‌లితాలొస్తాయ‌ట‌. ల‌లిత అష్టోత్త‌రాలు కూడా ఈ పూజకు ముందు ప‌ఠించాల‌ట‌. ఆ త‌ర్వాత ఆయుధ పూజ లేదా అస్త్ర పూజ‌లు చేయాల‌ట‌. కానీ జ‌న‌రేష‌న్ చేంజ్ అయిన కార‌ణంగా భ‌క్తి భావం ప్ర‌జ‌ల‌లో స‌న్న‌గిల్లింద‌ని అంటున్నారు.

సోష‌ల్ మీడియా ఆయుధ పూజ‌

ప్ర‌స్తుతం Ayudha Puja అంటే ఎదో సెల‌బ్రేష‌న్ లాగా చేసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని పెద్ద‌లు అంటున్నారు. ప్ర‌స్తుతం ఆయుధ పూజ టెక్నాల‌జీకి కూడా పాకింది. ఈ కాలం యువ‌త ఆయుధ పూజ‌ను బ్యాట్లు, క్రికెట్ కిట్లు, గ్యాస్ స్ట‌వ్‌, ఫోన్లు, కంప్యూట‌ర్ల వంటి ప‌రిక‌రాల‌కు కూడా పూజ‌లు చేస్తున్నార‌ట‌.

Share link

Leave a Comment