Ayesha Meera case:ఆయేషా మీరా హ‌త్య కేసు లో సంచ‌ల‌నం- విజ‌య‌వాడ పోలీసుల‌కు నోటీసులు

Ayesha Meera caseఢిల్లీ: గ‌తంలో సంచ‌ల‌నం రేపిన బీ ఫార్మ‌సీ విద్యార్థిని అయేషా మీరా హ‌త్య కేసులో స‌త్యంబాబు నిర్దోషిగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేదంటూ జాతీయ ఎస్స‌,ఈ ఎస్టీ క‌మిష‌న్ను ఆశ్ర‌యించారు. దీనిపై క‌మిష‌న్ గురువారం ఢిల్లీలో విచార‌ణ జ‌రప‌నుంది. అయేషా కేసులో విజ‌య‌వాడ పోలీసులు స‌త్యంబాబును అరెస్టు చేశారు. ఆయ‌న ఏకంగా 9 ఏళ్లు జైలు శిక్ష అనుభ‌వించారు. 2017లో హైకోర్టు ఆయ‌న‌ను నిర్థోషిగా తేల్చ‌డంతో జైలు నుంచి (Ayesha Meera case)విడుద‌ల‌య్యారు.

స‌త్యంబాబును నిందితుడిగా చూపించిన అప్ప‌టి పోలీసు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ప్ర‌భుత్వ అత‌డికి న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ రెండూ అమ‌లు కాని ప‌క్షంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌ని తీర్పులో తెలిపింది. అయితే స‌త్యంబాబుకు రూ.10 ల‌క్ష‌లు, రెండు ఎక‌రాల భూమి, ఇల్లు మంజూరు చేశామ‌ని హైకోర్టు తీర్పు త‌ర్వాత కృష్ణా జిల్లా అధికారులు ప్ర‌క‌టించారు. ఈ మూడు ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు అంద‌లేద‌ని జాతీయ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్‌నుకు ఇచ్చిన ఫిర్యాదులో స‌త్యంబాబు ప్ర‌స్తావించారు.

స‌త్యంబాబుతో పాటు ద‌ళిత సంఘాల ప్ర‌తినిధులు, పౌర హ‌క్కుల సంఘం నేత‌లు ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకున్నారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని విజ‌య‌వాడ పోలీసుల‌కు క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. ఒక ఏసీపీని విచార‌ణ నిమిత్తం అధికారులు ఢిల్లీకి పంపారు. ఈ వ్య‌వ‌హారంపై క‌మిష‌న్ ఎలా స్పందిస్తుద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Share link

Leave a Comment