Axis Bank Loans:యాక్సిస్ బ్యాంకు అందించే లోన్స్‌,ఋణాల గురించి తెలుసుకోండి!

Axis Bank Loans

Axis Bank Loans(యాక్సిస్ బ్యాంకు) అందించే కొన్ని అద్భుత‌మైన రుణాలు, లోన్స్ గురించి తెలుసుకోండి. భార‌త‌దేశంలో ప్ర‌ముఖ ప్రైవేటు బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఇప్పుడు క‌స్ట‌మ‌ర్ల‌కు, రైతుల‌కు, ఉద్యోగుల‌కు, సాధార‌ణ వ్య‌క్తుల‌కు వారి ఆర్థిక ప‌రిస్థితిని బ‌ట్టి ఋణాలు అందిస్తుంది. వాటి గురించి ఒక్కొక్క‌టి తెలుసుకోండి. (Axis Bank Loans)ఇది కేవ‌లం అవ‌గాహ‌న మాత్ర‌మే.

ఎంఎస్ఎంఇ మ‌రియు వ్యాపార ఋణ‌ములు :- ఎంఎంస్ఎంఇ లోన్ తీసుకుంటే త‌క్ష‌ణ‌మే ఋణ స‌దుపాయం ఉంటుంద‌ని ఈ బ్యాంకు చెబుతోంది. ఇందులో రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.5 కోట్ల వ‌ర‌కు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. న‌గ‌దు క్రెడిట్‌, ఓవ‌ర్ డ్రాప్ట్ స‌దుపాయాలు క‌ల‌వు. త‌న‌ఖా లేని ఇఎంఐ ఆధారిత ఆఫ్ష‌న్ ల‌భిస్తుంది.

గృహ ఋణ‌ములు:- గృహ ఋణ‌ములు వ‌చ్చేసి ప్ర‌తి 4 సంవ‌త్స‌రాల‌కు నాలుగు వాయిదాలు ర‌ద్దు చేయ‌బ‌డ‌తాయ‌ని బ్యాంకు చెబుతోంది. ఇందులో రూ.1 ల‌క్ష నుంచి లోన్ ప్రారంభమ‌వుతుంది. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద స‌బ్సీడిలు పొంద‌వ‌చ్చు. 30 సంవ‌త్స‌రాల వ‌ర‌కు రుణ వ్య‌వ‌ధి ఉంది.

వ్య‌వ‌సాయ రుణాలు :- వ్య‌వ‌సాయ మ‌రియు వ్య‌వ‌సాయేత‌ర సెక్యురిటీపై పంట ఉత్ప‌త్తి, పెట్టుబ‌డి మ‌రియు వినియోగ రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో ఋణాలు వ‌చ్చేసి రూ.25,001 నుంచి రూ.2.5 కోట్ల వ‌ర‌కు ఋణాలు తీసుకోవ‌చ్చ‌ని బ్యాంకు చెబుతోంది. వ్య‌వ‌ధి వ‌చ్చేసి 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంది.

వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల రుణాలు: – వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల రుణాల యాక్సిస్ బ్యాంక్‌లో 90% వ‌ర‌కు రుణ స‌దుపాయం అందిస్తోంది. హామీదారుడు అవ‌స‌రం లేద‌ని చెబుతోంది. 5 సంవ‌త్స‌రాల లోపు ఋణ‌ము తిరిగి చెల్లించ‌వ‌చ్చ‌ని బ్యాంకు చెబుతోంది. సౌక‌ర్య‌వంత‌మైన ఋణ‌ము తిరిగి చెల్లింపు స‌దుపాయం ల‌భిస్తుంది.

బంగారంపై ఋణ‌ములు: – ఈ బ్యాంకులో బంగారానికి సుర‌క్షిత‌మైన హామీ ఉంటుంద‌ని పేర్కొంది. రూ.25,000 నుంచి రూ.20ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు తీసుకోవ‌చ్చ‌ని వివ‌రిస్తోంది. మీ బంగారానికి ప్ర‌తి గ్రాముకు ఉత్త‌మ విలువ ప్ర‌క‌టిస్తుంది. వెంట‌నే రుణం మంజూరు చేయ‌బ‌డుతుంద‌ని బ్యాంకు చెబుతోంది. అదీ కూడా అతి త‌క్కువ డాక్యుమెంటేష‌న్‌తో..

క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్ లోన్: – వాహ‌నాల‌కు సంబంధించి ఈ బ్యాంకు ఇన్వాయిస్ విలువ‌లో 100% వ‌ర‌కు లోన్ మంజూరు చేస్తుంది. 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు రుణ వ్య‌వ‌ధి ఉంది. సింగిల్ వాహ‌న య‌జ‌మానుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన స్కీమ్‌లు ల‌భిస్తాయ‌ని యాక్సిస్ బ్యాంకు వివ‌రిస్తోంది.

వ్య‌క్తిగ‌త ఋణ‌ములు :- వ్య‌క్తిగ‌త ఋణ‌ముల్లో ఫోర్‌క్లోజ‌ర్ లేదా పాక్షిక చెల్లింపు ఛార్జీలు లేవ‌ని బ్యాంకు చెబుతోంది. రూ.50 వేల నుంచి రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ తీసుకునే వెసులుబాటు క‌ల‌దు. 12-60 నెల‌ల వ్య‌వ‌ధిలో సౌక‌ర్య‌వంతంగా ఋణ‌ము తీర్చుకోవ‌చ్చు.

కారు లోన్స్ :- మీ కొత్త కారుపై జీరో డౌన్‌పేమెంట్ అవకాశం ఉంది. రూ.1 ల‌క్ష నుంచి ఋణాలు ప్రారంభ‌మ‌వుతాయి. సుల‌భంగా మ‌రియు జంజాటం లేకుండా డాక్యుమేంటేష‌న్ జ‌రుగుతుంది. పాక్షిక ప్రీ- పేమెంట్ స‌దుపాయం ల‌భిస్తుంది.

టూ వీల‌ర్ లోన్స్ :- స్కూట‌ర్‌లు మ‌రియు బైక్‌లు అన్నింట‌కీ లోన్స్ ల‌భిస్తాయి. 48 నెల‌ల వ‌ర‌కు రుణ వ్య‌వ‌ధి అవ‌కాశం ఉంది. ఆన్‌-రోడ్డు ఫండింగ్‌లో 100% వ‌ర‌కు వెసులుబాటు ఉంది. వ‌డ్డీ కూడా త‌క్కువ రూపాయ‌ల‌లో ల‌భిస్తుంది.

సేవింగ్స్ ఖాతా :- ఇందులో క‌నీసం రూ.5 వేల వ‌ర‌కు నిల్వ ఉంచాలి. రోజువారీ నిల్వ‌పై వ‌డ్డీ వ‌స్తుంది. షాపింగ్కి డెబిట్ కార్డు ఉప‌యోగించవ‌చ్చు. రూ.1 ల‌క్ష మ‌రియు అంత‌కుమించి వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా భ‌ద్ర‌త వెసులుబాటుంది.

కాల ప‌రిమితి డిపాజిట్ :- 25% వ‌ర‌కు మొద‌టి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌పై జ‌రిమానా లేద‌ని బ్యాంకు తెలుపుతోంది. ఎక్క‌డ నుంచైనా ఎఫ్‌డిలు తెర‌వ‌చ్చు. వంద‌ల కొల‌ది బ్రాంచీలు, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌, ఫోన్ బ్యాంకింగ్ స‌దుపాయాలు యాక్సిస్ బ్యాంకు అందించే సౌక‌ర్యాలు.

పైన తెలిపిన ఋణాలు, లోన్స్‌కు సంబంధించి మీ ద‌గ్గ‌రిలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ బ్రాంచిని లేదా ఫీల్డ్ వ‌ర్క‌ర్‌ను, ఏజెంట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. Axis Bank Customer Sevice No.1860 419 5555. https://www.axisbank.com/ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

Share link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *