autoimmune disease symptoms: మ‌న శ‌రీర ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థే మ‌న‌పై దాడి చేస్తే ఏమౌతుంది?

autoimmune disease symptoms

autoimmune disease symptoms: శ‌రీరం వ్యాధుల బారిన ప‌డ‌కుండా కాపాడ‌టానికి, దాని వ్య‌తిరేక శ‌క్తుల‌తో పోరాడ‌టానికి మ‌న‌లో ఒక ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఉంటుంది. కొన్ని లోపాలు ఏర్ప‌డిన‌ప్పుడు ఈ వ్య‌వ‌స్థ ఒక్కోసారి పొర‌బ‌డి త‌న సొంత శ‌రీరం మీదే దాడి చేస్తుంది. ఫ‌లితంగా థైరాయిడ్ స‌మ‌స్య‌లు, రూమ‌టాయిడ్ ఆర్ధ‌రైటిస్‌, తెల్ల మ‌చ్చ‌లు, సొరియాసిస్‌, ర‌క్త‌హీన‌త‌, కండ‌రాల నొప్పులు, మ‌ధుమేహం, ఎస్ఎల్ఇ (సిస్ట‌మిక్ ల్యూప‌స్ ఎరెథిమెటాసిస్‌) వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు (autoimmune disease symptoms) వ‌చ్చిప‌డ‌తాయి.

రూమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్‌

ఇదొక ఇన్‌ప్ల‌మేట‌రీ ఆర్థ‌రైటీస్‌, జీవ‌క్రియ‌ల్లో ఏర్ప‌డే అస‌మ‌తుల్య‌త వ‌ల్ల త‌లెత్తే ఆటో ఇమ్యూన్ డిసీజ్‌. శ‌రీరంలో ఇరుప‌క్క‌ల్లో ఉండే కీళ్ల‌కు స‌మాంతరంగా ఇది వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్ర‌మైన వాపున‌కు గురి కావ‌డంతో పాటు, కీళ్ల క‌దిల‌క‌లు పూర్తిగా స్థంభిస్తాయి.

థైరాయిడ్ స‌మ‌స్య‌లు

శ‌రీరంలో త‌యారైన యాంటీబాడీస్ ఒక్కో సారి థైరాయిడ్ గ్రంథికి వ్యాపిస్తాయి. ఈ క్ర‌మానికి కొన్ని నెల‌ల నుంచి కొన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. రేడియేష‌న్ తీసుకున్న కార‌ణంగా కొంద‌రిలో థైరాయిడ్ గ్రంథి దెబ్బ‌తిని, హైపోథైరాయిడిజం రావ‌చ్చు. అరుదుగా కొంద‌రిలో హైప‌ర్ థైరాయిడిజం కూడా రావ‌చ్చు.

ల‌క్ష‌ణాలు

థైరాయిడ్ వ్యాధిలో మ‌ల‌బ‌ద్ధ‌కం, డిప్రెష‌న్‌, నీర‌సం, అల‌స‌ట‌, వెంట్రుక‌లు రాలిపోవ‌డంతో పాటు గోళ్లు విర‌గ‌డం, కాళ్లూ చేతుల్లో వాపు, గొంతు బొంగురుపోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు ప్ర‌ధానంగా క‌నిపిస్తాయి.

సొరియాసిస్‌

ఇది శ‌రీర‌మంతా పొలుసులుగా వ‌చ్చే ఒక దీర్ఘ‌కాలిక చ‌ర్మ‌వ్యాధి. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా, ప్ర‌పంచ జ‌నాభాలో మూడు శాతం మందిని వేధిస్తున్న వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువుగా, మోచేతులు, మోకాళ్లు , త‌ల‌, వీపు, అరిచేతులు, అరికాళ్లు, పొట్ట‌, మెడ‌, నుదురు, చెవుల ప్రాంతాల్లో ఎక్కువ‌గా వ్యాపిస్తుంది.

ల‌క్ష‌ణాలు

చ‌ర్మ ఎర్ర‌బ‌డ‌టం, జుట్టు రాలిపోవ‌డం, కీళ్ల నొప్పులు వంటి ల‌క్ష‌నాలు ప్ర‌ధానంగా క‌నిపిస్తాయి. చ‌ర్మం పొడిబారి, చ‌ర్మం మీద ప‌గుళ్లు ఏర్ప‌డ‌టంతో పాటు ర‌క్త‌స్రావం అవుతుంది.

మ‌ధుమేహం(డ‌యాబెటీస్‌)

మ‌ధుమేహం టైప్ -1, టైప్ -2 అంటూ రెండు ర‌కాలుగా ఉంటుంది. టైప్ -1 వ్యాధి 20 ఏళ్ల క‌న్నా ముందే మొద‌లువుతుంది. టైప్ -2 మ‌ధుమేహం 20 ఏళ్లు దాటాక మొద‌ల‌వుతుంది. ప్ర‌పంచంలోని ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రు ఈ మ‌ధుమేహం బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉంది.

ల‌క్ష‌ణాలు

ఆక‌లి, నీర‌సం, దాహం ఎక్కువుగా ఉండ‌టం, అతి మూత్రం, చూపు మంద‌గించ‌డం, వేగంగా బ‌రువు త‌గ్గ‌డం, త‌రుచూ త‌ల‌నొప్పి, గుండెద‌డ‌, చెమ‌ట‌లు ప‌ట్ట‌డం, చాలా కాలందాకా గాయాలు మాన‌క‌పోవ‌డం కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఈ వ్యాధిలో క‌నిపిస్తాయి.

ఎస్ఎల్ఇ(సిస్ట‌మిక్ ల్యూప‌స్ ఎరిథిమెట‌సిస్‌)

ఈ వ్యాధిగ్ర‌స్తుల్లో శ‌రీరంలోని ప‌లు అవ‌య‌వాలు వ్యాధి గ్ర‌స్త‌మ‌వుతాయి. జ‌న్యుప‌ర‌మైన ప‌ర్యావ‌ర‌ణ ప‌ర‌మైన కార‌ణాల‌తోపాటు మాన‌సిక ఒత్తిళ్లు కూడా ఈ జ‌బ్బుకు దారి తీస్తాయి.

ల‌క్ష‌ణాలు

ముఖం మీద ద‌ద్దుర్లు రావ‌డం, చ‌ర్మం ఎర్ర‌బ‌డ‌టం, పొలుసులు రావ‌డం, చ‌ర్మం మీద న‌ల్ల‌టి మ‌చ్చ‌లు, కండ‌రాలు నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి ల‌క్ష‌ణాలు ఈ వ్యాధిలో ప్ర‌ధానంగా క‌నిపిస్తాయి. వీటితో పాటు, శ‌రీరంమంతా వాపులు రావ‌డం, బ‌రువు పెర‌గ‌డం వంటి ల‌క్ష‌ణాలు కూడా బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఈ వ్యాధి సోకితే, పిండ‌మ‌ర‌ణం, లేదా గ‌ర్భస్రావం జ‌రిగే అవ‌కాశం ఉంది.

Share link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *