Auto Stunts | నడిరోడ్డపైన అర్ధరాత్రి అత్యంత ప్రమాదకరంగా ఆటోలతో విన్యాసాలు, స్టంట్స్ చేస్తూ ప్రజలను భయానికి గురి చేసేలా పెద్ద పెద్ద కేకలు వేస్తూ భయాందోళనకు గురిచేసి తోటి వాహనాలను ఓవర్ టేక్ చేస్తూ రచ్చ చేసిన ఆరుగురు యువకులను చంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. దక్షణి మండల డీసీపీ గజరావు భూపాల్ తెలిపిన వివరాల ప్రకారం టోలిచౌకి ప్రాంతానికిచ ఎందిన సయ్యద్ జుబేర్ అలీ(20, సయ్యద్ సాహిల్(21), మహ్మద్ ఇబ్రహీం (22), మహ్మద్ ఇనాయత్(23), గులాం సైఫ్‌ద్దీన్ (23), మహ్మద్ సమీర్(19), అమీర్‌ఖాన్(20) అద్దెకు(Auto Stunts) ఆటోలను నడుపుతున్నారు.
గురువారం అర్థరాత్రి మూడు ఆటోలతో చాంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చారు. అక్కడ నుంచి రాత్రి 12.30 గంటలకు బాబానగర్ మీదుగా డీఆర్డిఎల్ సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకున్నారు. అనంతరం బాబానగర్ వైపు ప్రయాణమయ్యారు. మూడు ఆటోలను రెండు టైర్లపై క్రాస్‌గా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులను భయాందోళనకు గురిచేశారు. ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగించారు. రోడ్లపై వీరు చేసే స్టంట్స్ ను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఆ ఆరుగురి నిందితులను పట్టుకొని అరెస్టు చేశారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. మరో ఆటోతో పాటు డ్రైవర్ మహ్మద్ ఇబ్రహీం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఫలక్‌నుమా ఏసీబీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ ఎం.మదుసూదన్ రెడ్డి, ఎస్సైలు గౌస్‌ఖాన్, గోవర్థన్ రెడ్డి ఉన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ