Auto finance company

Auto finance company:ఫైనాన్స్ కంపెనీ వేధింపులు త‌ట్టుకోలేక.. ఓ ఆటో డ్రైవ‌ర్ ఆవేద‌న‌!

Spread the love

Auto finance company: త‌న‌కు, త‌న కుటుంబానికి జీవ‌నాధారంగా ఉన్న ఆటోను ఫైనాన్స్ కంపెనీ వేధింపులు త‌ట్టుకోలేక త‌న సొంత ఆటోను కాల్చేశాడు ఓ డ్రైవ‌ర‌న్న‌. ఈ విషాద సంఘ‌ట‌న హ‌న్మ‌కొండ న‌క్క‌ల కుంట జంక్ష‌న్‌లో శ‌నివారం చోటు చేసుకుంది. ఆ డ్రైవ‌రు త‌న ఆటోను న‌డి సెంట‌ర్‌లో పెట్రోలు పోసి నిప్పంటించిన ఘ‌ట‌న వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోలో అంద‌రూ చూస్తుండ‌గానే న‌డి సెంట‌ర్‌లో ర‌ద్దీగా ఉన్న హ‌న్మ‌కొండ న‌క్క‌ల‌కుంట జంక్ష‌న్‌లో ఆటోను పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆటో పూర్తిగా ద‌గ్థ‌మైంది. ఇటీవ‌ల వ‌రుస‌గా పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌ల వ‌ల్ల జీవ‌నోపాధి కోల్పోయాన‌ని బాధిత ఆటో డ్రైవ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఆటో ఫైనాన్స్ (Auto finance company)చెల్లించ‌లేక నిప్పంటించాన‌ని చెప్పాడు. లాక్‌డౌన్‌లో కొద్ది రోజులు ఆటో తిర‌గ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని, ప్ర‌స్తుతం ఆటో తిప్పుతున్న‌ప్ప‌టికీ ఎక్కే ప్ర‌యాణికులు త‌క్కువ అయ్యార‌ని డ్రైవ‌ర్ ఆవేద‌న‌గా చెప్పాడు.

ఈ నేప‌థ్యంలోనే వాహ‌నాన్ని కాల్చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం క‌నిపించ‌లేద‌ని డ్రైవ‌ర్ క‌న్నీరు పెట్టుకున్నాడు.

ఆటోకు నిప్పు పెట్టిన డ్రైవ‌ర్ వీడియో

TS News:విక‌లాంగుడిగా పుట్ట‌డ‌మే పాప‌మా..? ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పూనుకున్న ఓ వ్య‌క్తి

TS Newsవ‌రంగ‌ల్: త‌న భూమిలో అక్ర‌మంగా బోరు వేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఎదుట మంగ‌ళ‌వారం పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు Read more

rold gold haram:చెల్లి పెళ్లి అంటూ న‌కిలీ బంగారం అంట‌గ‌డుతున్న ముఠా! ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కిన వైనం!

rold gold haramవ‌రంగ‌ల్: పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని న‌కిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్ర‌జ‌ల వ‌ద్ద నుండి డ‌బ్బును సంపాదిస్తున్న ఇద్ద‌రు స‌భ్యుల ముఠాను ఇంతేజా గంజ్ పోలీసులు Read more

Warangal cp tarun joshi: డీజిల్ చోరీల ముఠా ఆగ‌డాలు పెరుగుతున్నాయి… వారి ప‌ని ప‌ట్టాలి

Warangal cp tarun joshi వ‌రంగ‌ల్: మ‌త్తు ప‌దార్థాల సేవించ‌డంతో పాటు, వాటిని త‌ర‌లించ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప‌రిణామాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించే విధంగా గ్రామాల్లో అవ‌గాహ‌న Read more

crime news: తాత,మ‌న‌మడు ఉంటున్న ఇంట్లో ఫ్రిజ్లో మృత‌దేహాన్ని చూసి షాక్ తిన్న పోలీసులు

crime news: వ‌రంగ‌ల్: అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బుల్లేవ‌ని ఓ మ‌న‌వ‌డు తాత చ‌నిపోవ‌డంతో ఫ్రిజ్‌లో మృత‌దేహాన్ని దాచిపెట్టాడు. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల‌లో వెలుగు చూసింది. పోలీసులు Read more

Leave a Comment

Your email address will not be published.