
కర్కపల్లి గ్రామంలో దారుణం
Knife Attach News | పంచాయతీ తీర్పులో మాజీ సర్పంచ్‌పై కత్తితో దాడిJayashankar Bhupalpally : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యభర్తల పంచాయతీ నిర్వహిస్తున్న పెద్ద మనుషులపై అదే గ్రామానికి చెందిన బింగి నరేష్ గౌడ్కత్తితో(Knife Attach) మాజీ సర్పంచ్ పెంచల రవీందర్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో మూడు చోట్ల గాయపరచగా, హుటాహుటిన గ్రామస్థులు మాజీ సర్పంచ్ ను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న గణపురం పోలీసులు విచారణ చేపడుతున్నారు.
పోలీసులకే సవాల్ విసిరిన నిందితుడు!
నిందితుడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తుండగా వారి సమక్షంలోనే నలుగురిని చంపి వారి తలకాయలు తీసుకొచ్చి స్టేషన్ లో ఇస్తానని పోలీసులకు సవాల్ విసిరాడు బింగి నరేష్ గౌడ్. పంచాయతీలో భాగంగా బింగి నరేష్ గౌడ్ ఆ గ్రామంలో ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టారు. బింగి నరేష్ గౌడ్ వ్యవహరిస్తున్న తీరు సబబు కాదని పెద్ద మనుషులు చెప్పడంతో ఒక్కసారిగా ఊగిపోయిన బింగి నరేష్ గౌడ్ కల్లు గీసే కత్తితో హల్చల్ చేశాడు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఇది చదవండి:మదనపల్లె కేసు వాదనకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది
ఇది చదవండి:భారత దేశంలో కార్మిక ఉద్యమ చరిత్ర పూర్వ పరిస్థితి!
ఇది చదవండి: జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
ఇది చదవండి:మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్