ATM card change

ATM card change: ముస‌లివారిని టార్గెట్ ..ఏటీఎంలో డ‌బ్బులు మాయం!

Andhra Pradesh
Share link

ATM card change గుంటూరు: అత‌ను ఏటిఎం వ‌ద్ద‌నే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. ఎవ‌రు ఏటిఎంలోకి వెళితే వారి వెనుకాలే ఉంటాడు. ఏటిఎంలో డ‌బ్బులు తీయ‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి మాట‌ల్లో పెడ‌తాడు.క‌న్ఫ్యూజ్ చేస్తాడు. క్ష‌ణాల్లో అవ‌త‌లి వ్య‌క్తి ఒరిజ‌న‌ల్ ఏటిఎం త‌న చేతిలోకి వ‌చ్చేలా చేస్తాడు. న‌కిలీ ఏటిఎం స‌ద‌రు వ్య‌క్తి చేతిలో పెడ‌తాడు. ఇలా అంద‌ర్నీ కాదులే న‌డి వ‌య‌స్సులో ఉన్న వారు వృద్ధుల‌ను మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నాడు. త‌న మోసాల‌ను పోలీసులు ప‌సిగ‌ట్టారు. పోలీసు స్టేష‌న్‌కు న‌డువు నాయ‌నా! అన్నారు. (ATM card change)ఇక అస‌లు క‌థ‌కు వ‌స్తే..!

గుంటూరు(Guntur) జిల్లా కొత్త పేట పోలీసుస్టేష‌న్ ప‌రిధిలో అక్టోబ‌ర్ 10న స‌త్తెన‌ప‌ల్లికి చెందిన న‌ల్ల నూక‌ల వెంక‌టేశ్వ‌ర్లు అనే అత‌ను కొత్త‌పేట‌(Kottapeta)లోని సంతోష్ హోండా షోరూం ఎస్‌బిఐ ఏటీఎం(SBI ATM)లో డ‌బ్బులు డ్రా చేయ‌డానికి వ‌చ్చారు. అత‌ని వెనుక ఒక వ్య‌క్తి వెంక‌టేశ్వ‌ర్లును క‌న్ఫ్యూజ్ చేసి అత‌ని ఏటీఎం కార్డు తీసుకొని డబ్బులు డ్రా చేస్తాన‌ని చెప్పాడు. అత‌ని ఏటీఎం కార్డు తీసుకొని వెళ్లిపోయాడు. దీనిని ఉప‌యోగించి అందులో ఉన్న డ‌బ్బుల డ్రా చేస్తున్నాడు. అయితే బాధిత వ్య‌క్తి వెంక‌టేశ్వ‌ర్లు కొత్త పేట పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకొని ఏటీఎం లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ ప‌రిశీలించిన పోలీసులు ముండ్ల‌ముడి వెంక‌టేశ్వ‌ర‌రావు ను నిందితుడుగా అనుమానించారు.

ముండ్ల‌ముడి వెంక‌టేశ్వ‌ర‌రావు స్వ‌గ్రామ‌మైన ఈపూరు మండ‌లం ఇనిమేల్ల గ్రామం ఎస్సై మ‌ధు ప‌వ‌న్ త‌న సిబ్బందితో వెళ్లి అత‌న్ని ప‌ట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడ్ని పోలీసులు విచారించ‌గా ఏటీఎం వ‌ద్ద‌కు వ‌చ్చే వృద్ధుల‌ను టార్గెట్ చేసి వారికి మాయ‌మాట‌లు చెప్పి డ‌బ్బులు తీసి ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికేవాడు. అలా ఏటీఎంల‌ను మారుస్తూ మోసాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని పోలీసులు తెలిపారు.

See also  పంచాయ‌తీ ఏక‌గ్రీవాలు: నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి

Leave a Reply

Your email address will not be published.