gold smuggling: ఏకంగా విమానం సీటులోనే దాచాడు.. అధికారులు నోరెళ్ల బెట్టారు!
gold smuggling కర్నాటక: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు కొందరు వ్యక్తులు మాస్టర్ మైండ్‌ను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ అంతకంటే మెగా మాస్టర్ మైండ్ ఉన్న అధికారులు చిటెకలో కనిపెట్టేస్తున్నారు. తాజాగా విమానంలోని సీటు కింద బంగారాన్ని దాచి అక్రమంగా తరలించాలని యత్నించాడు ఓ వ్యక్తి. అయితే బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని(gold smuggling) కనిపెట్టేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.61 లక్షలుగా ఉంటుందని చెప్పారు.

దుబాయ్ నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇండిగో విమానం గురువారం చేరుకుంది. ప్రయాణికులంతా దిగాక, విమానాన్ని తనిఖీ చేస్తుండగా ఈ బంగారం బయట పడింది. ఎకానమీ క్లాస్‌లోని ఓ సీటుకు ప్యాకెట్ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అందులో చూడగా పేస్ట్ రూపంలో, 29 స్టిక్స్ రూపంలో 701 గ్రాముల బంగారం బయటపడింది. దీనిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించిన నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు.