Special Police Officer : కృష్ణా జిల్లా నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఓలకు స్పెషల్ ఎన్పోర్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందల్ కరోనా కిట్లు పంపిణీ చేశారు. విధుల్లో అలసత్వం ఉండొద్దని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.
Special Police Officer : Tiruvuru : స్పెషల్ పోలీసు ఆఫీసర్ల(SPOs)కు విధి నిర్వహణపై కృష్ణా జిల్లా స్పెషల్ ఎన్పోర్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందల్ దిశానిర్థేశం చేశారు. తిరువూరులో ఎట్ హోమ్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఓ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి 120 మంది ఎస్పీఓ(SPOs)లకు కరోనా కిట్లు అందజేశామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల ఆటలు సాగనివ్వబోకుండా, అక్రమ మార్గాల ద్వారా ఇసుక, మద్యం అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారన్నారు. ఈ చెక్‌పోస్టుల వద్ద పోలీసు సిబ్బందికి సహాయకారిగా ఉండటానికి పోలీసు విధానాల పట్ల పూర్తి ఉత్సాహవంతులైన యువకులను ఎస్పీఓలుగా తీసుకున్నట్టు తెలిపారు. అలా ఎస్పీఓగా నియమితులైన సిబ్బంది చెక్‌పోస్టుల వద్ద నిరంతరం విధులు నిర్వర్తిస్తూ జిల్లాలోని అక్రమ మద్యం, ఇసుక వంటి వాటిని రాకుండా నివారించడమే కాక ఎక్కడికక్కడ అక్రమ మార్గాల ద్వారా చేసే రవాణాను కట్టడి చేస్తున్నారన్నారు.
ఇప్పటి వరకు ఎంతో నిబద్ధతగా విధులు నిర్వర్తించారని, మీరంతా నీతి నిజాయతీతో విధులు నిర్వర్తిస్తూ వ్యవస్థలకు మంచి పేరు తీసుకురావాలని, అలా కాకుండా ఏమైనా విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందని, ఏమైనా ఆరోపణలు ఎదుర్కొంటూ అవి నిజమని నిర్థారణ అయితే దాని ప్రభావం భవిష్యత్తుపై ఉంటుందని హెచ్చరించారు. కాబట్టి క్రమశిక్షణ భరితంగా విధులు నిర్వర్తించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో 120 మంది ఎస్పీఓ(SPOs)లకు డ్రై ఫ్రూట్స్(dry fruits), మెడిసిన్స్(medicine) తో కలిగిన కరోనా కిట్లను, మాస్కను అందజేశారు. విధి నిర్వహణలోనే కాకుండా, వ్యక్తిగత సంరక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, నూజివీడు, తిరువరు ఇన్స్పెక్టర్లు, సబ్ డివిజన్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started