artificial intelligence | మన రోజువారీ జీవనంలో కృత్రిమ మేధ(AI) ఒక భాగంగా మారింది. స్మార్ట్‌ఫోన్‌లో వాడే ఫేస రికగ్నైజేషన్ ఆప్షన్, అసిస్టెంట్ మెనూ, చాట్‌బోట్స్ మొదలైనవన్నీ దీని ఆధారంగానే పనిచేస్తాయి. హైవేలపై ప్రయాణించే వాహనాల వేగాలను సూచించే డిస్ప్లే బోర్డులు, గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఈ-పేమెంట్ అప్లికేషన్లో కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు.
మనిషి ఏదైనా పనిచేసే ముందు దాని గురించి ఆలోచించి, విషయాలను గ్రహించి, సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరిస్తాడు. అదే పనిని యంత్రాల సాయంతో అత్యంత నేర్పుగా లేదా సమర్థవంతంగా చేయడాన్ని Artificial మేధగా పేర్కొంటారు. ఇది ఆవిర్భావం నుంచే అనేక రకాల నూతన సాంకేతిక తలను అనుసరిస్తూ నేటి కృత్రిమ మేధగా పరిణామం చెందింది. యంత్ర పరికరాలు లేదా మెషిన్లు ప్రదర్శించే మేధా శక్తిని కృత్రిమ మేధగా చెప్పొచ్చు. ఇది Computer Science అధునాతన విభాగం. దీని ద్వారా మనిషి మేధో సంపత్తి కలిగిన నూతన యంత్రాలు లేదా కంప్యూటర్లను రూపొందించవచ్చు. సమాచార సేకరణ, వాటి ప్రక్రియల అనుసంధానం, గణన శక్తి, మేధోపరమైన నిర్వహణ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఫలితంగా అక్కడ ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.
ఆర్థిక రంగంలో..
artificial intelligence ద్వారా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ముందుగానే కనుక్కోవచ్చు. Financial మార్కెట్లో జరిగే అక్రమ లావాదేవీలను ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా నియంత్రించవచ్చు. Share Markets ట్రేడింగ్ వ్యవస్థలో దీన్ని అనుసంధానించడం ద్వారా మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చు.
తయారీ పారిశ్రామిక రంగంలో..
కృత్రిమ మేధ ప్రవేశంతో పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు వచ్చాయి. Marketలో అత్యధిక డిమాండ్ ఉన్న వస్తువులను, వాటి సరఫరాకు కావాల్సిన ముందస్తు ప్రణాళికలను దీని ద్వారా రూపొందించ్చు. ఆయా ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను, పంపిణీని నిర్దేశించవచ్చు.
గవర్నెన్స్
artificial intelligenceలోని డీప్ లెర్నింగ్ పద్ధతులను సమర్థంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలువుతున్నాయో తెలుసుకోవచ్చు. ప్రభుత్వం అందించే నిధులు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు చేరాయో, లేదో తెలుసుకోవచ్చు.
చట్టాలు అమలులో
కృత్రిమ మేధను చట్టాల అమలులో ఉపయోగించడం వల్ల నేర నిర్థారణ కచ్చితత్వం పెరుగుతుంది. దీనికి ముఖ కవళికల గుర్తింపు (Facial Recognition), గొంతు లేదా మాటల గుర్తింపు (Speech Recognition) మొదలైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీనిద్వారా దోషులను వేగంగా, పారదర్శకంగా గుర్తించవచ్చు.


ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనే సమస్యలు
AI అనుసంధానం ద్వారా ప్రకృతి వైపరీత్యాల ముందస్తు హెచ్చరికలు, అనంతరం తీసుకునే చర్యల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఉదా- 2014, అక్టోబరులో వచ్చిన హుద్‌హుద్ తుపాను సమయంలో ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరికలు ద్వారా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించారు.
ప్రతికూలతలు..
ఈ భవిష్యత్ టెక్నాలజీల ఆవిష్కరణ, ఉపయోగంతో సాంకేతిక నిరుద్యోగం((Technological Unemployment)) ఏర్పడుతుంది. యంత్రాలు, కంప్యూటర్లు మానవ మేధ ఆధారంగా పని చేయగలువు. కానీ పరిస్థితులను అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేవు. AIలో భాగమైన సమాచార నిక్షిప్తత, సేకరణ వల్ల గోప్యత హక్కుకు Right to Privacy భంగం కలుగుతుంది. ఈ సాంకేతికత వినియోగం నైతిక, సాంఘీక సవాళ్లకు కూడా తెరతీస్తుంది.
AI యొక్క ఉపయోగాలు
అంతర్జాలంలో జరిగే మోసాలను, సైబర్ నేరాలను కృత్రిమ మేధ సాయంతో సమర్థంగా ఎదుర్కోవచ్చు. కోవిడ్ సమయంలో ఏఐ పని తీరు, కోవిడ్ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో ఏఐ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది. థర్మల్ ఇమేజింగ్ పరిజ్ఞానంతో రూపొందించిన Infrared థర్మామీటర్ రూపొందించింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను Nithi Aayog విడుదల చేసింది. వీటి ప్రకారం 1.ఆరోగ్యం 2.వ్యవసాయం 3.విద్య, 4.పట్టణాలకు అవసరమైన స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5.రవాణా రంగాల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని నిర్థేశించారు.