Armed gang Robbery in Muthoot finance branch in Tamil Nadu | తమిళనాడులో ముతూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ
Armed gang Robbery in Muthoot finance branch in Tamil Nadu
TamilNadu: తమిళనాడులో భారీ దొంగతనం చోటుచేసుకుంది. క్రిష్టగిరి జిల్లా హోసూర్- బగలూరు రోడ్డు వద్ద ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లోకి చొరబడ్డ దుండగులు పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం సిబ్బంది బ్రాంచ్‌ను తెరిచారు. కాసేపటికే కస్టమర్ల రూపంలో దుండగలు ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా, వారిని గన్‌తో బెదిరించి తాడులతో కట్టేశారు.
అనంతరం లాకర్ తాళం తీసుకుని, సుమారు 25 కేజీలకుపైగా బంగారాన్ని రూ.90 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆఫీసుకు వచ్చాక అసలు విషయం బయటకు వచ్చింది. తాళ్లతో కట్టేసి ఉన్న నలుగురిని విడిపించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బంగారు ఆభరాల విలువ రూ.7 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీంచి నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పారిపోయిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది చదవండి : బెదిరింపులకు భయపడేవాళ్లం కాదు!
ఇది చదవండి : నా విజయం వెనుక అమ్మ ఉంది
ఇది చదవండి : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి : నకిలీ మిరపనారు..లబోదిబోమంటున్న రైతన్నలు
ఇది చదవండి: 19న నితిన్ కొత్త సినిమా ‘చెక్’ విడుదల
ఇది చదవండి: గ్రామాలకు సీఎం జగన్ శుభవార్త