Arilova Police Station: విశాఖ పట్టణం : ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ పట్టణం జిల్లా ఆరిలోవ పోలీస్ స్టేషన్‌పై శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ పాత నిందితుడు వద్ద కేసు మాఫీకి సంబంధించి వ్యవహారంలో రూ.7,000/- వేలు లంచం అడిగిన ఎస్ఐ శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.
ఓ పాత కేసులో నిందితులైన బొడ్డేపల్లి వైకుంఠరావు అనే వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం ఉదయం పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా శ్రీనివాసరావును పట్టుకున్నారు. గత కొంత కాలంగా ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ప్రతి పనికీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
బాధితుల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాలంటే నే బాధితులు భయపడే పరిస్థితి తీసుకొచ్చారని పలువురు బాధితులు గగ్గోలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఏసీబీ దాడులు మరింత బలాన్ని చేకూర్చాయి.
ఈ పోలీస్ స్టేషన్(Arilova Police Station)లో పనిచేస్తున్న ఎస్ఐ శ్రీనివాసరావు శైలి ముందు నుంచే వివాదస్పదంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులను భయపెట్టి బెదిరించి సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పాత నేరస్థుడు బొడ్డేపల్లి వైకుంఠ రావు నేరుగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి రెడ్ హ్యాండెడ్‌గా లంచం ఇస్తూ పట్టుబడినట్టు చేశారు.
పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు జరగడంతో ఒక్కసారిగా పోలీసుశాఖ ఉలిక్కి పడింది. ఈ దాడుల్లో ఏసీబీ డిఎస్పీ బివిఎస్ రమణ మూర్తి, సిఐలు లక్ష్మణమూర్తి, ఎస్.రమేష్, ఎస్కె కె గపూర్, ప్రేమకుమార్ తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. అనంతరం ఎస్సైను రిమాండ్‌కు తరలించినట్టు తెలుస్తోంది.
ఏసీబీ దాడులు వీడియో దృశ్యాలు
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?