ganjai: విశాఖపట్టణం అరకు ప్రాంతం నుండి బిహార్, ఉత్తర ప్రదేశ్ కు అక్రమంగా తరలిపోతున్న సుమారు కోటి రూపాయల విలువ గల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ గంజాయి అక్రమ రవాణా వివరాలు అందించారు.
విశాఖపట్టణం అరకు నుండి బిహార్, ఉత్తర ప్రదేశ్ పన్నెండు చక్రాల లారీలో భారీగా గంజాయి(ganjai) రవాణా జరుగుతున్నదనే పక్కా సమాచారంతో రాష్ట్ర సరిహద్దుల్లోని ఇచ్చాపురం సమీపంలోని పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు.
చార్కోల్ లోడుతో వెళ్తున్న లారీలో గంజాయి ని గుర్తించారు. గుర్తించిన వెయ్యి యాభై కేజీల గంజాయి బహిరంగ మార్కెట్లో సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ అమిత్ వెల్లడించారు. ఈ కేసులో పలువురిని అందుపులోకి తీసుకున్నామని చెప్పారు.


ఈ గంజాయి అక్రమ రవాణాకు స్థానికుల సహకారం ఉందని తమ దర్యాప్తులో తేలిందని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాశిబుగ్గ డిఎస్పీ ఎం.శివరామిరెడ్డి, ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వినోద్ బాబు, పట్టణ ఎస్సై వి.సత్యనారాయణ, రూరల్ ఎస్సై హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?