April 19th 2022 News | ఈ రోజు ఏప్రిల్ 19,2022 వార్తలు, విశేషాలు, ముఖ్యాంశాలు తెలుసుకోండి. దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని వార్తా విశేషాలను చదవండి. లేటేస్ట్ అపడేట్స్ కోసం, ఇతర అంశాల (April 19th 2022 News) గురించి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Hero Madhavan కొడుకు గోల్డ్ మెడల్ కొట్టాడు
స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదాంత్(Vedaant Madhavan) మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టాడు. మొన్న స్విమ్మింగ్ కాంపిటీషన్ డానిష్ ఓపెన్‌లో సిల్వర్ సాధించిన వేదాంత్. తాజాగా జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా మాధవన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన కుమారుడికి మద్దతిచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు.
Tamilnadu: తల్లిని ఇంట్లో బంధించి పదేళ్లుగా హింస
కొందరి మనుషుల్లో రోజురోజుకూ మానవత్వం మంటగలుస్తోంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిని ఇంట్లో బంధించి పదేళ్లుగా హింసించారు. ఈ దారుణమైన ఘటన వెలుగులోకి రావడంతో కొడుకులిద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం తమిళనాడులోని తంజావూరు జిల్లా కావేరినగర్‌కు చెందిన జ్ఞానజ్యోతి అనే వృద్ధురాలు వయసు 72. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకులు ఆస్తి తగాదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు.
వీళ్లిద్దరూ తల్లిని పట్టించుకోకుండా ఓ ఇంట్లో బంధించారు. వారానికోసారి మాత్రమే వచ్చి బిస్కెట్లు తెచ్చి గేటు లోంచి లోపలికి విసిరేసి వెళ్లేవారు. ఆ వృద్ధురాలి పరిస్థితిని చూసి స్థానికులే అప్పుడప్పుడు ఆహారం పెట్టేవారు. ఇదే పదేళ్ల నుంచి ఆ వృద్ధురాలు ఎంతో ఆవేదన చెందుతోంది. ఇటీవల ఓ సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని గుర్తించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెను కాపాడాల్సిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో అధికారులు ఆ వృద్ధురాలిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. అధికారులు వెళ్లి ఆ వృద్ధురాలు ఉన్న రూం తాళ్లం తీస్తుండగా కొడుకులిద్దరూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సహాయంతో అధికారులు రూం తాళ్లం తెరిచి ఆ వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఆమె కొడుకులిద్దరినీ అరెస్టు చేశారు.
21న Yerrakota నుంచి ప్రధాని ప్రసంగం
ఈ నెల 21న సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. తేగ్ బహదూర్ స్మారకార్థం నాణెంతో పాటు పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 400 మంది సిక్కు సంగీత కళాకారులు షాబాద్ కీర్తలను ఆలపించనున్నారు. ఈ వేడుకల్లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ, విదేశాల ప్రముఖులు పాల్గొననున్నారు.
Polavaramకి అన్ని విధాలుగా సహకరిస్తాం: కేంద్రం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ తెలిపారు. 2013-14 పోలవరం ప్రాజెక్టు అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపిందని, పెరిగిన అంచనాలపై కమిటీ అధ్యయనం చేస్తందని చెప్పారు. ఇప్పటి వరకు పోలవరం నిర్మాణానికి కేంద్రం రూ.13 వేల కోట్ల ఇచ్చిందన్నారు. జల్‌జీవన్ మిషన్‌తో 2024 నాటికి ఏపీలో ప్రతి ఇంటికి మంచినీరిస్తామని ప్రహ్లాద్ సింగ్ ప్రకటించారు.
వెన్ను నొప్పి అంటే పశువుల Injection ఇచ్చాడు
ఒడిశా రాష్ట్రంలోని మహులదిహకు చెందిన శ్రీకంఠ అనే వ్యక్తి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన బిశ్వనాథ్ బెహరా అనే ఓ నకిలీ వైద్యుడ ప్రభుత్వ వైద్యుడిగా గ్రామస్తులను నమ్మించాడు. ఇది నమ్మి శ్రీకంఠ, బెహరా దగ్గరికి వెళ్లగా అతనికి ఒకేసారి 3 ఇంజక్షన్లు చేశాడు. అనుమానంతో ఇంజెక్షన్లపై ఆరా తీయగా అవి పశువులకు ఇచ్చేవని తేలింది. బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు నకిలీ వైద్యుడిని అరెస్టు చేశారు.
Anakapalle: ఇష్టం లేని పెళ్లి కాబోయే భర్త గొంతు కోసిన యువతి
పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఓ యువతి ఊహించని పని చేసింది. కాబోయే భర్త గొంతు కోసేసింది. ఈ ఘటన అనకాపల్లిలో సంచలనం రేపింది. ఈ నెల 29న నిశ్చితార్థం నిర్ణయించారు. యువకుడు హైద్రాబాద్ సీఎస్ఐఆర్ పరిశోధకుడిగా చేస్తున్నాడు. అయితే ఈమెకు ఈ వివాహం ఇష్టం లేదు. ఇటీవల హైదరాబాద్ నుండి యువకుడు విశాఖ వచ్చాడు. నీతో మాట్లాడాలని యువకుడికి యువతి చెప్పింది. దీంతో వారిద్దరూ కలిసి కొమ్మలపూడి సాయిబాబా కొండపైకి వెళ్లారు.
ఒక సర్‌ఫ్రైజ్ ఉందని, కళ్లు మూసుకుంటే ఇస్తానని యువతి చెప్పడంతో ఆమె చెప్పినట్టే యువకుడు కళ్లు మూసుకున్నాడు.వెంటనే షాపులో కొన్న చాకుతో యువకుడి గొంతు ఒక్కసారిగా కోసేసింది. దీంతో అతను రక్తపు మడుగులో కొట్టుమిట్టాడాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరకుని అతన్ని అనకాపల్లిలోని ఉష ఫ్రేమ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తల్లిదండ్రులకు చెప్పినా వినిపించుకోలేదని పోలీసులకు ఆ యువతి తెలిపింది. విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.