App Manager | సాధారణంగా మన android phoneలలో ఎన్నో apps ను install చేస్తుంటాం, అదే క్రమంలో uninstall కూడా చేస్తుంటాం. కొన్ని కొన్ని సార్లు ఫోన్లలో ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయిన యాప్స్ వల్ల ఫోన్ స్లోగా కూడా అవుతుంది. అలాంటప్పుడు కొన్ని యాప్స్‌ను phoneలో నుండి అన్ ఇన్స్టాల్ చేస్తుంటాం. అలా చేసేటప్పుడు కొన్ని apps అన్ ఇన్స్టాల్ కావు. కాకుండానే మన ఫోన్ బ్యాగ్రౌండ్ డేటాలో వర్క్ అవుతూ ఉంటాయి. లేదా మన ఫోన్ screen మీద కనిపిస్తుంటాయి. కాబట్టి అలాంటి సమస్యల నుండి బయట పడాలంటే App Manager చాలా అవసరం. ఇప్పుడు యాప్ మేనేజర్ గురించి తెలుసుకుందాం!.
ఈ యాప్ Manager వల్ల ఏమైనా అనవసరమైన యాప్‌లను అన్ఇన్స్టాల్ చేయడానికి, లేదా ఇన్స్టాల్ చేయడానికి చాలా సులభమైన పద్ధతిలో మనకు సహాయ పడుతుంది. యాప్ ను అన్ ఇన్స్టాల్ చేయాలన్నా, ఇన్స్టాల్ చేయాలన్నా మన ఫోన్లలో ఇది అవసరం పడుతుంది. అలాగే యాప్‌లు Reset చేయడానికి దోహద పడుతుంది. మీరు ప్లే స్టోర్ నుండి కాకుండా డైరెక్టుగా ఫోన్ స్రీన్ మీద నుండే ఇన్స్టాల్, అన్ ఇన్స్టాల్ చేయవచ్చు. వాటి తాలూకా అన్ని ఫైల్స్‌ను తొలగించవచ్చు.
ఈ యాప్ ఫోన్లలో Rooted Devices పరికరాల పనితీరును మెరుగు పర్చడానికి ఉపయోగపడుతుంది. APK, APKS, APKM, XAPK Files ను నేరుగా ఇన్స్టాల్ చేయవచ్చు. దీని ద్వారా Play Store నుండి అన్ఇనస్టాలేషన్, Share, డిసేబుల్ /Enable, రీ ఇన్స్టాల్, మేనేజ్ లాంటి కార్యకలాపాలను చేయవచ్చు. మీ ఫోన్లో ఉండే అన్ని రకాల యాప్స్‌ను చూపిస్తుంది. విడ్జెట్లు, Live wallpapers, Keyboards, లాంచర్లు, ప్లగిన్లు చూపిస్తుంది. వాటిని ఎలా నిర్వహించుకోవాలో, ఉపసంహరించుకోవాలో మిమ్మల్ని అనుమతి అడిగేందుకు దోహద పడుతుంది. ఇందులో యాప్ సమాచారం, ఇన్స్టాల్ తేదీ, నెంబర్, వెర్షన్ అన్నీ చూపిస్తుంది. ఇది మీ ఫోన్లలో చాలా సులభంగా, ఉచితంగా వినియోగించుకోవచ్చు.


















app link: Download