AP Wine:స్ట‌ఫ్‌గా పాములు, బ‌ల్లులు మేము అడిగామా సార్‌?

0
1

AP Wine: ఏపీలో మ‌ద్యం ఏరులై పారుతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు గొంతెండెట‌ట్టు అరుస్తున్నాయి. మ‌రో ప్ర‌క్క మ‌ద్యం నియంత్ర‌ణ మా మ్యానిఫెస్టులో ఉంది, నియంత్రిస్తాం అని ప్ర‌భుత్వం చెబుతుంది. ఎవ‌రెన్ని అన్నా అటు ప్ర‌తిప‌క్షాల్లోనూ, ఇటు అధికార ప‌క్షాల్లో మ‌ద్యం ప్రియులు లేకుండా లేర‌నుకోండి. అస‌లు మ‌ద్యం బాటిల్ స‌ర‌ఫ‌రా లేకుండా ఎమ్మెల్యేగా గెలిచే స‌త్తా ఉందా? అంటే ఒక్క‌రు కూడా ముందుకు రారు.

ఇక ఏపీలోని గుంటూరులో మ‌ద్యం సీసా (AP Wine) లో పాము పిల్ల రావ‌డం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. జిల్లాలోని పొన్నూరులోని బాప‌ట్ల బ‌స్టాండ్ వ‌ద్ద ఉన్న ప్ర‌భుత్వం మ‌ద్యం దుకాణంలో గ‌త రాత్రి కొంద‌రు యువ‌కులు మ‌ద్యం బాటిల్‌ను కొనుగోలు చేశారంట‌. ఇంటికి వెళ్లి అట్ట పెట్టె తెరిచి చూస్తే మ‌ద్యం సీసాలో పాము పిల్ల ను చూసి షాక్ అయ్యారు. వెంట‌నే మ‌ద్యం షాప్ వ‌ద్ద‌కు వెళ్లారు. దుకాణంలోని సిబ్బందిని నిల‌దీయ‌డంతో మ‌రో బాటిల్ ఇచ్చి వెన‌క్కి పంపించారు. ఏపీలో ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్(viral) అవుతోంది.

AP Wine: మ‌ద్యం బాటిల్‌లో పాముపై ఫ‌న్నీ మీమ్స్‌!

ఈ వార్త ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చిందో, సోష‌ల్ మీడియాలో ఫ‌న్నీ మీమ్స్ కూడా త‌యార‌య్య‌యి. మ‌ద్యం ప్రియులు త‌మ‌దైన శైలిలో ప్ర‌భుత్వంపై ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. 200 పెట్టి మందు కొనుకున్న మేము 10 రూపాయ‌లు పెట్టి స్ట‌ఫ్ కొనుక్కోలేమా సార్‌..స్ట‌ఫ్‌గా పాములు, బ‌ల్లులు మేమ‌డిగామా సార్‌..అంటూ కామెంట్లు పెడుతున్నారు. మా స్టేట్‌లో అంతే..మందులో పాము పిల్ల‌లు, బ‌ల్లి పిల్ల‌లు వ‌స్తుంటాయి..ఇవ‌న్నీ కామ‌న్‌..అంటూ మీమ్స్ పెడుతున్నారు. మొద‌టి సారి మందు కొంటే అందులో పాము పిల్ల వ‌చ్చిందిరా…ఇంకా న‌యం తాగ‌క‌ముందే గ‌మ‌నించాను రా మావా..! అంటూ ఫ‌న్నీగా మీమ్స్ పెడుతున్నారు.

వెంక‌టేష్ మీమ్స్‌

ఇక వైన్స్ బాటిల్లో పాము పిల్ల రావ‌డంపై ప్ర‌తిపక్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. AP లో క‌ల్తీ మ‌ద్యం త‌యార‌వుతుంద‌ని, ప్ర‌జ‌ల ప్రాణాల‌తో వైసీపీ ప్ర‌భుత్వం చెల‌గాట‌మాడుతోంద‌ని ఆరోపించారు. కొత్త కొత్త బ్రాండ్ల‌తో మ‌ద్యం (WINE) తాగేవారికి పిచ్చెక్కిపోతుంద‌ని పేర్కొంటున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం మ‌ద్యం నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కొంద‌రు పేర్కొంటుండ‌గా, నాణ్య‌మైన మ‌ద్యం(AP Wine) అందించాల‌ని మ‌ద్యం ప్రియులు ప్ర‌భుత్వాన్ని విన్న‌వించుకుంటున్నారు.

Latest Post  viral news of kejriwal: కేజ్రీవాల్ ఐడియా సూప‌ర్ - ఢిల్లీ టాప‌ర్ ఎందులో అంటే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here