ap weather report విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో మరో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. గత గురువారం తూర్పు గాలులతో ద్రోణి ఏర్పడగా, నైరూతి బంగాళా ఖాతము దగ్గర ఉన్న ఉత్తర శ్రీలంక (srilanka) తీర ప్రాంతం నుండి ఉత్తర బంగాళా ఖాతములోని మధ్య ప్రాంతాల మధ్య వరకూ వ్యాపించి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు (ap weather report) చెబుతున్నారు.
శుక్రవారం శ్రీలంక నుంచి పశ్చిమ మద్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి వ్యాపించి యున్నదని వాతావరణ శాఖ తెలిపింది. అయితే క్రమ క్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ముడు రోజుల వరకు వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నట్టు తెలిసింది. ఉత్తర కోస్తా ఆంధ్రా తో పాటు, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. ఇక శనివారం, ఆదివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
బెంజి సర్కిల్(benz circle) పై వంతెన ప్రారంభం వాయిదా!


విజయవాడలో ఉన్న బెంజిసర్కిల్ వంతెన ప్రారంభోత్సవం మరలా వాయిదా పడింది. ఇందుకు కారణం భారత ఆర్మీ జవాన్లు దురదృష్టవ శాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరులైన కారణంగా దేశంలో సంతాప దినాలు ప్రకటించింది కేంద్రం. శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ వంతెన ప్రారంభిచాల్సి ఉంది. ప్రారంభోత్సవానికి జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసి ఉంది. ఈ వంతెనతో పాటు కేంద్ర మంత్రితో రాష్ట్రంలో ఉన్న మరికొన్ని పెద్ద ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణకు శంకుస్థాపనలు చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే వారం రోజుల సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రారంభోత్సవం వాయిదా పడింది. మరోసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమయం తీసుకుని మూహుర్తం నిర్ణయించనున్నారు ఏపీ అధికారులు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!