175 నియోజకవర్గాలకు ఒక్కో వాహనం
రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో వైద్యుడు
Animals ambulance : మనుషులకు అత్యవసరమైన సేవలు అందాలంటే 108 కు ఫోన్ చేస్తే ప్రభుత్వ అంబులెన్స్ కుయ్..కుయ్ మంటూ సైరన్ మోగించుకుంటూ వస్తుంది. అదే తరహాలోని పశువులకు సత్వర వైద్య సేవలు అందించాలనే ఉద్ధేశంతో ఫోన్ చేస్తే ఇకపై సంచార వైద్య శాఖ గ్రామాలకు రానుంది. అందులోని పశువైద్య సిబ్బంది పశువులు, గొర్రెలు, మేకలకు చికిత్స చేసి, రైతులకు, పెంపకం దారులకు మందులు ఇచ్చి వెళతారు.
మారుమూల గ్రామాలకు సైతం సేవలు
Animals ambulance : ఇలాంటి సంచార వైద్యశాల (అంబులెన్స్) వాహనాలను త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాలకు చేరనున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు మెరుగైన వైద్యం అందించడమే వీటి లక్ష్యం. నియోజకవర్గా నికి ఒకటి చొప్పున 175 వాహనాలు రానున్నాయి. సోమవారం తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించారు. 6,099 పశు సంవర్థక అసిస్టెంట్ల ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రైతు భరోసా కేంద్రాల్లో పశువైద్యుడు
రైతు భరోసా కేంద్రాలలో ఇకపై పశు వైద్యుడు అందుబాటులో ఉండాలని సూచించారు. కియోస్క్ ద్వారా పశువుల దాణా, మందులు ఇవ్వాలన్నారు. సీడ్, ఫీడ్, మెడికేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాసిరకం వాడకూడదని, కచ్చితంగా నాణ్యతా ప్రమానాలు పాటించాలని ఆదేశించారు. పశువుల అంబులెన్స్ సంచార వైద్య సేవలపై రైతుల్లో ఆసక్తి నెలకొల్పేల చర్యలు తీసుకోవాలని కోరారు.


పశు సంచార వైద్యానికి కొత్తగా వాహనాలను కేటాయించడంపై పాడిరైతులలో ఎంతో సంతోషం నెలకొననుంది. గ్రామ గ్రామాన పశువైద్యానికి అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి. రైతులు ఫోన్ చేయగానే వారి ఊరికి పోయి, పశువైద్య సిబ్బంది మూగ జీవాలకు చికిత్స అందిస్తారు. పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చే స్థితిలో లేని వారికి ఇది ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా పశువైద్యసేవలు అందనున్నాయి. పశువుల వద్దకే వైద్యం రావడం మంచి పరిణామని పాడి రైతులు, పెంపకం దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started