Ap speed news | ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం వెలువడిన కొన్ని వార్తలను కింద ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్తల్లో లాక్డౌన్ విధించుకున్న గ్రామస్థులు శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొత్త రేషన్ కార్డులపై మంత్రి కారుమూరి కీలక ప్రకటన చేశారు. జగన్‌పై ఎల్లో మీడియా విమర్శపై మరో మంత్రి మీడయా(Ap speed news)తో మాట్లాడారు. నెల్లూరి వైసీపీ రాజకీయ పోరు సీఎం జగన్ వద్దకు చేరింది. తనపై వస్తున్న ప్రచారంపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు.
Lockdown విధించుకున్న గ్రామస్తులు
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో గ్రామస్థులు లాక్డౌన్ విధంచుకున్నారు. దుష్టశక్తులున్నాయంటూ గ్రామం చుట్టూ ముళ్ల కంచెలు వేసుకున్నారు. ఈ మూఢనమ్మకంతో వెన్నలవలసలో క్షుద్రపూజలు చేస్తున్నారు. ఈ నెల 25 వరకు గ్రామంలోకి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించుకున్నారు. ప్రభుత్వం స్కూళ్లు, అంగన్వాడీలకు తాళాలు వేయగా రంగంలోకి దిగిన పోలీసులు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఏపీలో New Ration Cardలు జారీపై ప్రకటన
జూన్‌లో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి కారుమూరి చెప్పారు. కార్డులు పోతాయని సోము వీర్రాడు అర్థరహితంగా మాట్లాడుతున్నారు. రేషన్‌కు నగదు బదిలీపై 2017లో కేంద్రం తెచ్చిన పథకాన్ని ఏపీలో అమలు చేస్తున్నాం. పథకం గురించి సోము వీర్రాజు ప్రధానని ప్రశ్నించాలన్నారు. నగదు బదిలీపై ప్రజలపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. కేంద్రం ఆదేశాలను బీజేపీ నేతలే విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి కారుమూరి విమర్శించారు.
Jagan ధైర్యాన్ని తట్టుకోలేకే విమర్శలు
ఎల్లో మీడియా విచక్షణ కోల్పోయి ప్రభుత్వంపై దారుణమైన రాతలు రాస్తోందని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. జగన్ ఏ పని చేసినా ప్రజలకు లబ్ధి చేకూరేలా చూస్తారన్నారు. సీఎం జగన్ ధైర్యాన్ని తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. చంద్రబాబు వెన్నుపోటు దారుడు అని, వెన్నుపోటు అని గూగుల్ లో కొడితే సిబిఎన్ ఫొటో వస్తుందని ఆయన విమర్శించారు.
Nellore news: అనిల్‌తో నాకు విబేధాలా!
సీం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో భేటీ అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎలా పనిచేశారో, ఇప్పుడు అలాగే పనిచేసుకోమని సీఎం జగన్ చెప్పారన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్‌తో విబేధాలు లేవని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సభ పెట్టుకుంటే తప్పేంటి? అని అన్నారు. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవద్దని సూచించారు. అనిల్ కుమార్, తాను వెళ్లి సీఎంను కలవడం వెనుక ఉద్దేశాలేమీ లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు మంత్రి కాకాణి.
బురద రాజకీయాలు చేయడం మాకు రావు!: janasena
జనసేన పార్టీ అధినేత Pawan కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బురద రాజకీయాలు చేయడం తమ పార్టీకి చేతకాదని ఆయన స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలవడం మా బాధ్యత అన్నారు. రైతుల్లో మనోస్థైర్యం నింపేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. సాగు నష్టం, రుణభారంతో రైతులు కుంగిపోతున్నారన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు సాయం చేయడంపై ప్రభుత్వం ఆలోచించాలని, భూ రికార్డుల్లో పొరపాటును సరిచేయాలి కానీ రైతులను అధికారుల చుట్టూ తిప్పించుకోవడం ఏమిటని పవన్ మండిపడ్డారు.
జీతం వద్దన్న APIIC ఛైర్మన్
ఏపీ ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనం తనకు వద్దని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి ఆర్థిక శాఖకు లేఖ రాశారు. తనకు వచ్చే వేతనాన్ని తిరిగి ఖజానాకు జమ చేస్తానని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు తనకు జీతం వద్దని తెలిపారు. కాగా గతంలో ఏపీఐఐసీ ఛైర్మన్‌కు వేతనంతో కలిపి ఇతర సౌకర్యాలకు రూ.3.82 లక్షలు చెల్లించే వారు. ఇటీవల ప్రభుత్వం వేతనాలపై సీలింగ్ విధించడంతో వేతనం రూ.65 వేలకే పరిమితమైంది.
బాబు ఆ రూ.200 కోట్లు ఏం చేశారు?: Vijaya sai Reddy
అధికారంలో ఉన్నప్పుడు AP మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్లబొల్లి కబుర్లు చెప్పారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. పార్టనర్షిప్ సదస్సుల పేరుతో రూ.200 కోట్లు దుబారా చేశారని ఆరోపించారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.40 లక్షల ఉద్యోగాలతో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరని చెప్పిన మాటల్లో ఒక్కటైనా నిజమైందా? అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఉత్తుత్తి ఎంఏయులతో ప్రజలను పిచ్చోళ్లను చేయాలని చంద్రబాబు చూశాడని అన్నారు.
నేను ఎప్పటికీ వీర సైనికుడినే!: Byreddy
తాను TDPలో చేరుతున్నట్టు జరుగున్న ప్రచారంపై YCP యువనేత బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్పందించారు. వైసీపీ పార్టీ మాదే. నేను ఎప్పటికీ జగన్ విధేయుడినే అని అన్నారు. నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని ఖండించారు. నేను ఎప్పటికీ వైసీపీ వీర సైనికుడినే అని, నాపై నమ్మకంతో నందికొట్కూరు పార్టీ ఇంఛార్జ్ బాధ్యతలు, శాప్ ఛైర్మన్ పదవిని సీఎం జగన్ ఇచ్చారన్నారు. ఇంత చేసిన పార్టీని నేనెందుకు వీడతాను? అని బైరెడ్డి ప్రశ్నించారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ