AP PRC 2021

AP PRC 2021: పీఆర్సీపై ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాదించిన అంశాలు ఏమిటి?

Andhra Pradesh
Share link

AP PRC 2021 పీఆర్సీ అమలుపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, జి.ఏ.డి ముఖ్య‌కార్య‌ద‌ర్శి శశిభూష‌ణ్ కుమార్, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స‌భ్య సంఘాల‌తో స‌మావేశం బుధ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సంఘాలు కొన్ని అంశాలు(AP PRC 2021) ప్ర‌తిపాదించాయి.

1.సిపిఎస్(CPS) ర‌ద్దుపై హామీ నిలుపుకోవాలి.

2.క‌నీస వేత‌నం రూ.20,000 బ‌దులుగా రూ.26,000 అమ‌లు చేయాలి.

3.ఫిట్‌మెంట్ జె.ఏ.సి ఐక్య వేదిక 55 శాతం, ఎపిజిఇఎఫ్ 34 శాతం, ఎపిజిఇఏ 50 శాతం కోరారు.

4.ఎంబిఎఫ్(MBF) – ఐఆర్(IR) ఇచ్చిన 1.7.2019 నుండి అమ‌లు చేయాలి.

5.హెచ్‌.ఆర్‌.ఏ(HRA)- పాత‌రేట్లు కొన‌సాగించాలి.

6.అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.

7.సెల‌వు సౌల‌భ్యాలు సిఫార్సు మేర‌కు అంగీకారం మ‌రియు స‌రోగ‌సి సెల‌వు మంజూరు చేయాలి.

8.పెన్ష‌న‌ర్ల‌కు మెడిక‌ల్ అల‌వెన్స్ 500 బ‌దులు రూ.1000 అమ‌లు చేయాలి.

9.పెన్ష‌న్‌కు స‌ర్వీసుతో సంబంధం లేకుండా చివిర వేత‌నంలో 50 శాతం మంజూరు చేయాలి.

10.70 సంవ‌త్స‌రాలు నిండిన పెన్ష‌న‌ర్ల‌కు అడిష‌న‌ల్ క్వాంటం పెన్ష‌న్ కొన‌సాగించాలి.

11.ఎన్ హాన్స‌డ్ ఫ్యామిలీ జీవితాంతం కొన‌సాగించాలి.

12.గ్రాట్యుటీ గ‌రిష్ట ప‌రిమితి రూ.20 ల‌క్ష‌ల‌కు పెంచాలి.

13.సెంట్ర‌ల్ పే స్కేల్స్ అమ‌లు వ్య‌తిరేకం. రాష్ట్ర పే స్కేల్స్ కొన‌సాగించాలి.

14.ఏ.ఏ.ఎస్ 5/10/15/20/25 అమ‌లు చేయాలి.

15.పీఆర్సీ(AP PRC 2021) నివేదిక బ‌హిర్గ‌త ప‌ర‌చాలి. అధికారుల నివేదిక వ్య‌తిరేకిస్తున్నాము.

16.సి.సి.ఏ (CCA) కొన‌సాగించాలి.

17.హోమ్ గార్డుల వేత‌నాలు పెంచాలి.

18.45 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు నిండిన వితంతువు/ విడాకులు తీసుకున్న కుమార్తెల‌కు ఫ్యామిలీ పెన్ష‌న్ కొన‌సాగించాలి.

19.అంత్య‌క్రియ‌ల ఖ‌ర్చులు ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు రూ.30 వేలు ల‌కు పెంచాలి.

20.ఫుల్ టైం(FULL TIME) కంటింజెంట్‌/ ఒప్పంద ఉద్యోగుల‌కు క‌నీస వేత‌నంతో పాటు డీఏ, హెచ్‌.ఆర్‌.ఏ చెల్లించాలి.

21.జె.ఏ.సి మిగిలిన 70 డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

See also  AP New Cabinet Ministers: జ‌గ‌న్ క్యాబినెట్‌లో కొత్త మంత్రులు వీరేనేమో?

Leave a Reply

Your email address will not be published.