AP Police Duty Meet 2021:TTD Chairman YV Subba Reddy was the chief guest | అసాంఘిక శ‌క్తుల‌ను అణ‌చి వేయండి

Spread the love

AP Police Duty Meet

ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు స‌భ‌లో

టీటీడీ ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి

AP Police Duty Meet 2021:TTD Chairman YV Subba Reddy was the chief guest |

అసాంఘిక శ‌క్తుల‌ను అణ‌చి వేయండిTirupati: రాష్ట్రంలో అసాంఘిక శ‌క్తులు

ప్ర‌వేశించాయ‌ని వాటిని గుర్తించి అణిచి వేయాల‌ని టిటిడి ఛైర్మ‌న్ వైవి. సుబ్బారెడ్డి

అన్నారు. రాజ‌కీయ ప్రేర‌ణ‌తో రాష్ట్రంలో ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని

వ్యాఖ్య‌లు చేశారు. తిరుప‌తిలో ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు స‌భ‌లో గురువారం

ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఆల‌యాల‌పై దాడుల వెనుక ఏ పార్టీ

వారున్నా నిర్థాక్షిణ్యంగా అణ‌చి వేయాల‌ని ఆయ‌న పోలీసుల‌ను కోరారు.

శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడే విష‌యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పోలీసు

ల‌కు పూర్తి స్వేచ్ఛ నిచ్చార‌ని చెప్పారు. ఆల‌యాలు, మ‌సీదులు, చ‌ర్చీల్లో 35 వేల

ఆధునిక సిసి కెమెరాలు ఏర్పాటు చేశామ‌న్నారు. అవ‌స‌ర‌మైన చోట మ‌రిన్ని సిసి

కెమె‌రాలు ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని టిటిడి ఛైర్మ‌న్ చెప్పారు.

సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 18 నెలల్లో రాష్ట్ర పోలీసు శాఖ‌కు 108

అవార్డులు రావ‌డం ప్ర‌భుత్వం, పోలీసు శాఖ‌ల ప‌నితీరుకు నిద‌ర్శ‌మ‌ని చెప్పారు.

AP Police Duty Meet

పోలీసుల సేవ‌లు అద్భుతం!

తిరుప‌తిలో పోలీసు డ్యూటీ మీట్ నిర్వ‌హించ‌డం వ‌ల్ల పోలీసు, టిటిడి విజిలెన్స్

శాఖ‌లు తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌ను ఎలా సేవ చేస్తున్నాయో దేశ వ్యాప్తంగా తెలిసే

అవ‌కాశం ఉంద‌న్నారు. సాధార‌ణ రోజుల్లో రోజుకు 70 నుంచి 80 వేల మంది భ‌క్తుల‌కు

శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేయించే వార‌మ‌ని ఆయ‌న అన్నారు. కోవిడ్ వ‌ల్ల ఇప్పుడు రోజుకు 30

నుంచి 35 వేల మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేయిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇదే

విష‌యం కేంద్రం ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు చెబితే ఆశ్చ‌ర్య పోయార‌ని తెలిపారు. పోలీసు,

టిటిడి ఉద్యోగుల స‌హ‌కారంతోనే ఇది సాధ్య‌మైంద‌ని తాను వారికి వివ‌రించాన‌ని

అన్నారు. కోవిడ్ స‌మ‌యంలో పోలీసులు అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు.

నేర ప‌రిశోధ‌న‌, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త విష‌యాల్లో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అంది

పుచ్చుకుని ముందుకు సాగాల‌ని సుబ్బారెడ్డి పోలీసుల‌కు పిలుపు నిచ్చారు.ఈ

కార్య‌క్ర‌మంలో రాష్ట్ర హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత పోలీసుల‌కు బ‌హుమ‌తులు

ప్ర‌దానం చేశారు.

ఇది చ‌ద‌వండి: యూపీ ముఖ్య‌మంత్రి రాజీనామా చేయాలి: ఐద్వా

Proud Moment! The father who saluted the daughter

Proud Moment! The father who saluted the daughter Tirupati: A wonderful scene took place in the city of Tirupati in Read more

road accidents: చిత్తూరు-అన్న‌మ‌య్య జిల్లాలో రోడ్డు ప్ర‌మాదాలు!

road accidents | చిత్తూరు-అన్న‌మ‌య్య జిల్లాల్లో గురువారం జ‌రిగిన వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ప‌లువురి గాయ‌ప‌డ‌గా ఇద్ద‌రు మృతి చెందారు. ఈ ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రుల‌కు Read more

Nandigama Circle: చీర‌తో బిగించి నిండు గ‌ర్భ‌ణీ భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

Nandigama Circle | ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండ‌లం Gollamudi గ్రామంలో హ‌త్య ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. గ్రామానికి చెందిన భూ ల‌క్ష్మికి అనారోగ్యం బాగాలేద‌ని కార‌ణంతో Read more

Badude Badudu: Nawabupeta గ్రామంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం!

Badude Badudu | NTR జిల్లా పెనుగంచిప్రోలు మండ‌లం న‌వాబుపేట గ్రామంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం గురువారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి జాతీయ కోశాధికారి, జ‌గ్గ‌య్య‌పేట Read more

Leave a Comment

Your email address will not be published.