AP Panchayat Polling: మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీకి షాక్! | Yalamarru village
Gudivada: గుడివాడ నియోజకవర్గం పామర్రు మండలంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి నాని స్వగ్రామమైన యలమర్రు గ్రామంలో టిడిపి బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించింది. యలమర్రు గ్రామ సర్పంచ్‌గా టిడిపి అభ్యర్థి కొల్లూరి అనుష 800 ఓట్లతో భారీ విజయం సాధించారు. దీంతో టిడిపి శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. తమ పార్టీ నేతలను మంత్రి కొడాలి నాని బూతులు తిట్టడాన్ని యలమర్రు గ్రామస్థులు జీర్ణించుకోలేకపోయారని, దీంతో కొడాలి నాని బలపర్చిన అభ్యర్థిని దారుణంగా ఓడించారని అక్కడ ఉన్న స్థానిక టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ విషయం చూసైనా కొడాలి నాని తీరు మారాలని సూచించారు.
మరోవైపు గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో 20 పంచాయతీలకు గాను 9 గ్రామాల సర్పంచ్ స్థానాలు టిడిపి గెలుచుకుంది. పలు గ్రామాల్లో టిడిపి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు.
ఇక స్వర్గీయ తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరులో టిడిపి ఘన విజయం సాధించింది. సర్పంచ్‌గా పడమట దుర్గా శ్రీనివాసరావు 121 ఓట్లతో విజయం సాధించారు. 10 వార్డుల్లో 8 వార్డులు టిడిపి, 2 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కె స్వగ్రామం పెదకాకానిలో 154 ఓట్ల ఆధిక్యంతో టిడిపి సర్పంచ్ గెలుపొందారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజని స్వగ్రామంలో టిడిపి ఘన విజయం సాధించింది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామంలోనూ టిడిపి అభ్యర్థి గెలిచారు. రామచంద్రాపురం నియరోజకవర్గం హసన్‌బాద్‌లో వైసీపీ అభ్యర్థిపై టిడిపి మద్దతుదారుడు నాగిరెడ్డి సతీష్ రావు 208 ఓట్ల మెజార్టితో విజయం సాధించారు.
ఇది చదవండి:ఇనిమెళ్ల గ్రామంలో కొట్టుకున్న టిడిపి-వైసీపీ వర్గీయులు
ఇది చదవండి:ఎస్సైలనే బెదిరించిన కిలాడీ లేడి..చివరకు!
ఇది చదవండి:కొత్త పార్టీపై షర్మిల బిజీ! ఖమ్మం నేతలపై ఫోకస్!
ఇది చదవండి: ఆ చేప మహా డేంజర్! తగిలితే అంతే సంగతులు!
ఇది చదవండి: అన్నపై ఎంత అభిమానమో!
ఇది చదవండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!