AP Panchayat elections: నేటితో ముగియనున్న తొలివిడత నామినేషన్లు దాఖలు గడువు
AP Panchayat elections: నేటితో ముగియనున్న తొలివిడత నామినేషన్లు దాఖలు గడువుAmaravathi: ఏపీలో నేటితో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు గడువు ముగియనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయాలి. దీంతో కొందరు ఆయా ఎన్నికల కేంద్రాల్లో నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు. చివరి రోజున నామినేషన్లు భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు దాదాపు 7 వేల 460 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. వార్డు స్థానాలకు 23 వేల 318 నామినేషన్లు వేశారు.
మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు భారీగా పెరిగాయి. శుక్ర, శనివారం రెండు రోజులు కలిపి ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 8 వేల 773 నామినేషన్లు దాఖలవ్వగా, వార్డు సభ్యుల స్థానాలకు 25 వేల 519 మంది నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 11 వందల 56 వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో వార్డు సభ్యలు స్థానాలకు అత్యధికంగా 4 వేల 678 నామినేషన్లు వేశారు. తొలివిడత పోరులో నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4వ తేది తుది గడువు, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అనంతరం అభ్యర్థలకు గుర్తులు కేటాయిస్తారు.

మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాలు కూడా అదే రోజు వెలువడతాయి. ఇక రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 2న నోటిఫికేషన్ వెలువడనుంది. మరోవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే రాయలసీమ జిల్లాల పర్యాటనలో ఉన్నారు. అక్కడ ఎన్నికల ఏర్పాట్లపై స్వయంగా సమీక్ష చేయనున్నారు.
AP Panchayat elections: సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 9,11,13,21 తేదీల్లో జరిగే పోలింగ్ కోసం స్థానికంగా ఆయా గ్రామ పంచాయతీల్లో సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పోలింగ్ తేది నుంచి 44 గంటల ముందుగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయి. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి తరలింపునకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలు సన్నద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎలక్షన్ ఏజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ వ్యవహరించొద్దని స్పష్టం చేసింది. ఎలక్షన్ ఏజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ వ్యవహరించొద్దని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ భవనాలను పోలింగ్ కేంద్రాలుగా వినియోగించుకు నేందుకు సెలవులు ప్రకటిస్తున్నట్టు స్పష్టం చేసింది ప్రభుత్వం.
ఇది చదవండి:భారత దేశంలో కార్మిక ఉద్యమ చరిత్ర పూర్వ పరిస్థితి!
ఇది చదవండి: జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
ఇది చదవండి: ఏపీలో నామినేషన్ల జాతర ప్రారంభం
ఇది చదవండి:మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడగింపు
ఇది చదవండి:రెండుగంటల్లో మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్