AP News today

AP News today:ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పై మ‌హిళా నాయ‌కురాలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Spread the love

AP News today:పెడ‌న: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన వైసీపీ పార్టీకి చెందిన కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పై ఆ పార్టీకి చెందిన మ‌హిళా నాయ‌కురాలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఇప్ప‌టికే ప‌లు మార్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ వార్త‌ల్లో నిలిచారు. గ‌తంలో టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు ఇంటిపై దాడిక ప్ర‌య‌త్నించార‌నే ఆరోప‌ణ‌లతో పాటు ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆగ్ర‌హానికి కూడా గుర‌య్యార‌నే వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ మ‌హిళా నాయ‌కురాలే జోగి ర‌మేష్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు(AP News today) చేశారు.

అస‌లు విష‌యానికి వ‌స్తే కృష్ణ జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నాయ‌కురాలు జ‌క్కా లీలావ‌తి తాజాగా ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జోగి ర‌మేష్ నుంచి త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని మీడియా ఎదుట చెప్పింది. ఈ నేప‌థ్యంలో తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చిన లీలావ‌తి జోగి ర‌మేష్ పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఎమ్మెల్యే వ‌ల్ల త‌మ‌కు ప్రాణ‌హాని ఉంద‌ని తెలిపారు.

త‌న భ‌ర్త కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండ‌లం ప‌డిత‌డిక స‌ర్పంచ్ ప్ర‌దీప్ కుమార్ అని తెలిపారు. గ‌తంలో త‌న భ‌ర్త‌పై కేసులు పెట్టి వేధించార‌న్నారు. త‌న భ‌ర్త‌కు ఎమ్మెల్యే జోగి రమేష్ కొంత మంది వ్య‌క్తులు చేత మ‌త్తుమందు ఇచ్చి త‌న వైపున‌కు తిప్పుకున్నార‌ని లీలావ‌తి ఆరోపించారు. పార్టీ కోసం తాము ఎంతో చేశామ‌ని, పాద‌యాత్ర స‌మ‌యంలోనూ జ‌గ‌న్ సీఎం కావాల‌ని, తామూ కూడా సంఘీభావం ప్ర‌క‌టించామ‌ని పేర్కొన్నారు.

పార్టీ అధికారంలోకి వ‌చ్చిన రెండున్న‌ర సంవ‌త్స‌రాల్లో ఎమ్మెల్యే త‌మ‌ను అనేక ఇబ్బందుల‌కు గురిచేశార‌ని లీలావ‌తి ఆరోపించారు. త‌మ‌ను చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని ఈ బెదిరింపుల‌తో తాము ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతున్నామ‌ని ఆమె చెప్పారు. ఈ నేప‌థ్యంలో జోగి ర‌మేష్ నుంచి త‌మ‌ను ర‌క్షించే బాధ్య‌త సీఎం జ‌గ‌న్ దేన‌ని లీలావ‌తి అన్నారు. ఇదిలా ఉండ‌గా..ఎమ్మెల్యే పై లీలావ‌తి చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈ విష‌యంపై ఏపీ ప్ర‌భుత్వం వైసీపీ ఎలా స్పందిస్తాయో చూడాలి.

Pedana(Krishna): విషాదం: అప్పుల బాధ‌తో చేనేత కుటుంబం ఆత్మ‌హ‌త్య‌

Pedana(Krishna) పెడ‌న: అప్పుల బాధ‌తో ఓ చేనేత కుటుంబం (Handloom family suicide)అంతా సామూహిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విషాద సంఘ‌ట‌న కృష్ణా జిల్లా పెడ‌న‌లోని మంగ‌ళ‌వారం వెలుగుచూసింది. Read more

fake currency printing:అమ్మో న‌కిలీ నోట్లు..ఒక‌టి కాదు..రెండు కాదు.. ల‌క్ష‌ల్లోనే!

fake currency printingపెడ‌న: కృష్ణా జిల్లాలో న‌కిలీ నోట్ల చ‌లామ‌ణి క‌ల‌క‌లం రేపుతోంది. ఈ దొంగ నోట్ల‌ను చ‌లామ‌ణి చేస్తున్నముఠా గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. వివ‌రాల్లో Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

pushpa lorry scene: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక మాఫియా ఆగ‌డాలు

pushpa lorry scene గ‌రిక‌పాడు: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక‌మాఫియా ఆగ‌డాలు ఏపీలో వెలుగు చూశాయి. ఏకంగా 11 ఇసుక లారీల‌ను ఆంధ్రా - తెలంగాణ స‌రిహ‌ద్దు Read more

Leave a Comment

Your email address will not be published.