AP News Today: ఉత్త‌రాంధ్ర‌లో మ‌న పార్టీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంది సార్‌! ఫోక‌స్ పెట్టండి!

Spread the love

AP News Today: జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు టి.శివ‌శంక‌ర్‌, బొలిశెట్టి స‌త్య బుధ‌వారం మ‌ధ్యాహ్నం క‌లిశారు.ఈ సంద‌ర్భంగా వారితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో పార్టీ బ‌లోపేతంపై చ‌ర్చించారు. ఆ మూడు జిల్లాల్లో ఉన్న స‌మస్య‌లు, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, ప‌ర్యావ‌ర‌ణ సంబంధిత స‌మ‌స్య‌లు చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌జాపోరాట యాత్ర చేప‌ట్టిన‌ప్పుడు వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను పార్టీ దృష్టికి తెచ్చార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం వ‌ల్ల నిర్వాసితులైన వారికి, భూములు ఇచ్చిన వారికి ఇప్ప‌టికే సెటిల్మెంట్ కాక ప‌రిహారం విష‌యంలో న్యాయం జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. ఈ అంశంలో పార్టీ ప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై త‌గిన ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో గ‌త కొన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్య‌క‌ర్త‌ల‌ను గుర్తించి వారిని పార్టీకి సంబంధించిన వివిధ క‌మిటీల్లో బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ద్వారా పార్టీని మ‌రింత‌గా ప‌టిష్ట ప‌ర్చ‌డానికి స‌మాలోచ‌న‌లు జ‌రిపామ‌న్నారు. ఈ నెల 7వ తేదీన ఉత్త‌రాంధ్ర ముఖ్య‌నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల‌ను క్రోడీక‌రించాల‌ని దిశానిర్థేశం చేశారు.

ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూ అని విష‌యాల్లో అండ‌గా ఉండే విధంగా పార్టీ క‌మిటీల నియామ‌కం జ‌ర‌గాల‌ని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాయ‌కుల‌కు తెలియ‌జేశారు. ఉత్త‌రాంధ్ర‌లో వివిధ ప్రాంతాల్లో కాలుష్యం కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర అనారోగ్యం బారిన ప‌డుతున్నారన్నారు. ఏ క‌ర్మాగారం వ‌ల్ల ఎటువంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం అవుతుందో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వివ‌రించారు.ఈ స‌మావేశంలో పార్టీ కోశాధికారి ఎ.వి.ర‌త్నం పాల్గొన్నారు.

JSForAP_Roads: గ‌జానికో గొయ్యి..రోడ్ల ప‌రిస్థితిపై జ‌న‌సైనికుల ఉద్య‌మం విజ‌య‌వంతం!

JSForAP_Roads: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క పిలుపుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు అధ్వానంగా ఉన్న రోడ్ల ప‌రిస్థితిని మీడియా కంటే ముందుగా వెలుగులోకి Read more

Bheemla Nayak: అడ‌వి పులి గొడ‌వ ప‌డే ఒడిసిప‌ట్టో..వ‌చ్చేసింది బీమ్లా నాయ‌క్ First Glimpse…ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎంట్రీ మామూలుగా లేదు భ‌య్యా!

Bheemla Nayak First Glimpse: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా క్రేజే వేరు అబ్బా.. అన్న సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు వెయ్యిక‌ళ్ల‌తో చూస్తుండ‌గా Read more

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet | స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్దు..బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవాళ్లం కాదు!

Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet తిరుప‌తి ప్రెస్‌మీట్‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ Tirupathi : జ‌న‌సేన Read more

New Movies news: లేటెస్ట్ టాలీవుడ్ మూవీస్ అప్‌డేట్స్ టుడే!

New Movies news | ఈ రోజు టాలీవుడ్ న్యూస్(గురువారం) కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ఆచార్య మూవీ అప్‌డేట్స్‌, స‌ర్కారు వారి పాట సాంగ్, ఆర్ఆర్ఆర్ దోస్తీ Read more

Leave a Comment

Your email address will not be published.