ap news today

ap news today: యువ‌కుడి మ‌ర‌ణంతో ఎస్సై, కానిస్టేబుల్‌పై స‌స్పెన్ష‌న్ విధించిన కృష్ణా జిల్లా ఎస్పీ!

Spread the love

ap news today: మ‌చిలీప‌ట్నం: పోలీస్ అంటే ప్ర‌జ‌ల్లో అపార‌మైన న‌మ్మ‌కం, వారికి స‌మ‌స్య వ‌స్తే వెంట‌నే ఆశ్ర‌యించేది పోలీస్‌స్టేష‌న్‌నే. అలాంటి పోలీస్‌శాఖ ప‌రువు ప్ర‌తిష్ట‌లు దెబ్బ‌తీసేలా, కీర్తి ప్ర‌తిష్ట‌ల‌కు విఘాతం వాటిల్లేలా ఏ సిబ్బంది వ్య‌వ‌హ‌రించినా వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌బోవ‌ని కృష్ణ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశ‌ల్ అన్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న‌, సిబ్బంది సొంత ప్ర‌యోజ‌నాల‌కు ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నా వారిపై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే కాక‌, క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి, వారిని విధుల నుంచి తొల‌గించ‌డానికి సైతం వెనుకాబోమ‌ని ఎస్పీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

అడిగినంత లంచం ఇవ్వ‌కుంటే అక్ర‌మ కేసులు బ‌నాయిస్తామ‌ని, ఒక యువ‌కుని బెద‌రించి, ఆ యువ‌కుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన కృష్ణా జిల్లా నందిగామ డివిజ‌న్ లో ఉన్న చిల్ల‌క‌ల్లు పోలీస్ స్టేష‌న్ కానిస్టేబుల్ -1687 ఎం.శివ‌రామ కృష్ణ ప్ర‌సాద్ ను, సిబ్బంది విధుల ప‌ట్ల స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ లేకుండా, విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వహ‌రించిన కార‌ణంగా ఎస్సై కె.దుర్గా ప్ర‌సాద్‌రావుపై స‌స్పెన్ష‌న్ వేటు విధిస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశ‌ల్ పోలీసు కార్యాల‌యం నుండి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే.. రాజ‌మండ్రికి చెందిన పిచ్చుక మ‌జ్జి (23) అనే యువ‌కుడు 2020 వ సంవ‌త్స‌రంలో అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా చేస్తున్నాడ‌నే కార‌ణంతో అత‌నిపై చిల్ల‌క‌ల్లు పోలీసు స్టేష‌న్‌లో క్రైమ్ నెంబ‌ర్ 716/ 2020 గా కేసు న‌మోదు కాబ‌డింది. అయితే అరెస్టు పెండింగ్ ఉంద‌ని 41 నోటీసు అంద‌జేయాల‌ని అత‌డినిక చిల్ల‌క‌ల్లు పోలీసు స్టేష‌న్‌కు పిలిపించారు.

పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన ఆ యువ‌కుడు పై విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శివ‌రామ‌కృష్ణ ప్ర‌సాద్ అత‌డిని రూ.1,00,000 లంచం డిమాండ్ చేశారు. డ‌బ్బు చెల్లిస్తేనే అత‌నిపై ఉన్న కేసుల‌ను మాఫీ చేస్తాన‌ని, లేకుంటే అక్ర‌మంగా గంజాయి కేసులు బ‌నాయిస్తాన‌ని, ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెబితే నిన్ను విడిచేది లేద‌ని తీవ్రంగా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఆ మాట‌లు విన్న ఆ యువ‌కుడు సెల్ఫీ వీడియో ద్వారా త‌న ఆవేద‌న‌ను తెలియ‌జేస్తూ రాజ‌మండ్రి లో త‌న ఇంటి వ‌ద్ద ఉరివేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

ఎస్సై, కానిస్టేబుల్‌పై స‌స్పెన్ష‌న్

ఈ స‌మాచారం తెలుసుకున్న ఎస్పీ వెంట‌నే త‌మ స్వ‌ప్ర‌యోజ‌నం కోసం ఒక యువ‌కుడి నిండు ప్రాణం బ‌లి కావ‌డానికి కార‌ణ‌మైన కానిస్టేబుల్ పై క్రిమినల్ కేసు న‌మోదు చేయ‌డ‌మే కాక విధుల నుండి స‌స్పెండ్ తో పాటు సిబ్బంది విధుల ప‌ట్ల స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ లేని కార‌ణంగా చిల్ల‌క‌ల్లు ఎస్సై పై స‌స్పెన్ష‌న్ వేటు విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మ‌నం నిర్వ‌హించే విధులు పోలీసు శాఖ ప్ర‌తిష్ట‌ను పెంచేలా ఉండాలి త‌ప్ప‌, కీర్తి ప్ర‌తిష్ట‌ల‌కు విఘాతం వాటిల్లేలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని, సిబ్బంది స్వ‌లాభం కోసం ఇలాంటి అవినీతి కార్య‌క‌లాపాలలో పాల్గొన్నా, అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న వారిపై వెంట‌నే క్ర‌మ శిక్ష‌ణారహిత్య చ‌ర్య‌ల్లో భాగంగా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయ‌డ‌మే కాక‌, శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌ద‌ని సిబ్బందిని హెచ్చ‌రించారు.

అంతే కాక ప్ర‌తి రోజూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక నిర్వ‌హిస్తున్న ప్ర‌తి రోజూ స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదికగా నిర్వ‌హిస్తున్న ప్ర‌తి రోజూ స్పంద‌న‌లో భాగంగా ప్ర‌జ‌లు ఎవ‌రైనా ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటు, దైర్యంగా త‌మ‌ను క‌లసి వారి స‌మ‌స్య‌ను తెల‌ప‌వ‌చ్చ‌ని ఎస్పీ తెలిపారు. వారి స‌మ‌స్య‌ను పోలీసు వాట్సాప్ నెంబ‌ర్ 91829 90315, ఆఫీసు ల్యాండ్ లైన్ నెంబ‌ర్ 08672254200 ల‌కు తెలియ‌జేయ‌వ‌చ్చు అని తెలిపారు. పోలీసు శాఖాప‌రంగా ఎదుర్కొంటున్న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో వెనుకాడ‌బోమ‌ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు.

Chevuturu(Krishna) Road accident:ఘోర రోడ్డు ప్ర‌మాదం ఆరుగురు ప్ర‌యాణికులు మృతి?

Chevuturu(Krishna) Road accident చెవుటూరు: కృష్ణా జిల్లా జి.కొండూరు మండ‌లంలోని చెవుటూరు స‌మీపంలో సోమ‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. తిరువూరు డిపోకు చెందిన ఎక్సప్రెస్ Read more

Tiruvuru Revenue Division:తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్ స్వాగ‌తిస్తూ సంబురాలు!

Tiruvuru Revenue Division ఎ.కంభంపాడు: కృష్ణా జిల్లా నుండి విడిపోయిన ఎన్టీఆర్ జిల్లా (విజ‌య‌వాడ‌)లో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్‌ను ప్ర‌భుత్వం నిర్థారించింది. దీనిని Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

pushpa lorry scene: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక మాఫియా ఆగ‌డాలు

pushpa lorry scene గ‌రిక‌పాడు: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక‌మాఫియా ఆగ‌డాలు ఏపీలో వెలుగు చూశాయి. ఏకంగా 11 ఇసుక లారీల‌ను ఆంధ్రా - తెలంగాణ స‌రిహ‌ద్దు Read more

Leave a Comment

Your email address will not be published.