ap news today: ఎలాంటి భ‌యాలు పెట్టుకోవ‌ద్దు..అలాంటి ఎగ్జామ్స్ స‌చివాల‌య ఉద్యోగుల‌కు ఉండ‌వ‌ట‌!

Spread the love

ap news today: అమ‌రావ‌తి: గ్రామ వార్డు స‌చివాల‌యం ఉద్యోగులు ప‌ర్మినెంట్ కావాలంటే క‌చ్చితంగా ప‌రీక్షలు రాసి పాస‌వ్వాల‌ని కొద్ది రోజుల క్రితం ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇది చూసిన గ్రామ వార్డు స‌చివాల‌యం ఉద్యోగులు ఆందోళ‌న ప‌డ్డారు. ఇంత కాలం క‌ష్ట‌ప‌డి చ‌దివి ఉద్యోగం తెచ్చుకుని ప్ర‌భుత్వానికి సేవ‌లు అందిస్తుంటే ఇప్పుడు మ‌ళ్లీ ప‌రీక్ష‌లేమిటి? అంటూ ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌లు సంధించారు. మ‌రో కొద్ది నెల‌ల్లో ప‌ర్మినెంట్ అవుతామ‌నుకున్న వారి ఆశ‌లు నిరాశ ప‌రిచేలా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఇది కాస్త రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్రొబేష‌న్ విష‌యంలో భ‌యం వ‌ద్దు!

ఈ ప్ర‌క‌టన‌పై గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ అజ‌య్ జైన్ స్పందించారు. స‌చివాల‌య ఉద్యోగుల‌కు సీబీఏఎస్ ప‌రీక్ష‌లు ఉండ‌బోవ‌ని ఎలాంటి భ‌యాలు పెట్టుకోవ‌ద్ద‌ని తెలిపారు. ఏపీపీఎస్ సి ద్వారా నిర్వ‌హించే డిపార్ట్ మెంట్ ప‌రీక్ష‌లు మిన‌హా ఎలాంటి ప‌రీక్ష‌లు పెట్ట‌డం లేద‌ని ఆయ‌న మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సిబిఏఎస్ కానీ ఏ ఇత‌ర అద‌న‌పు ప‌రీక్ష‌లు కానీ ఉద్యోగుల‌కు నిర్వ‌హించ‌ బోమ‌ని చెప్పారు. 2019 అక్టోబ‌ర్ 2న గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల శాఖ ఏర్పాటు చేశార‌ని అప్ప‌టి నుంచి రెండేళ్లు పూర్తి చేసుకున్న 1.34 ల‌క్ష‌ల మంది ఉద్యోగులంతా కేవ‌లం డిపార్టు మెంట్ ప‌రీక్ష‌లు పాసైతే చాలు అని అజ‌య్ జైన్ తెలియ‌జేశారు.

Nara Lokesh : విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాటమొద్దు

Nara Lokesh : విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాటమొద్దు Nara Lokesh : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే 80 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డే Read more

Mudragada letter: నా ఉత్త‌రాల‌కు భుజాలు త‌డుముకుంటున్న పెద్ద‌లు ఎందుకో మరి!?

Mudragada letter కాపు సంఘం అధినేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రాసిన లేక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త‌న ఉత్త‌రాలు చ‌దివి చాలా మంది పెద్ద‌లు భుజాలు Read more

TDP Volunteers: ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారనున్న వాలంటీర్లు

TDP Volunteers అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పైన ప‌లు విమ‌ర్శ‌లు చేసిన టిడిపి ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుని పార్టీ క్యాడ‌ర్‌లో ఉత్స‌హాన్ని నింపే ప్ర‌య‌త్నం Read more

fake currency:దారి బాట‌లో న‌కిలీ క‌రెన్సీ క‌ట్ట!

fake currencyవినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఈపూరు మండ‌లంలోని న‌కిలీ క‌రెన్సీ వెలుగు చూసింది. ఓ రైతు పొలంకు వెళుతుండ‌గా క‌వ‌ర్లో న‌కిలీ క‌రెన్సీ ఉండ‌టాన్ని Read more

Leave a Comment

Your email address will not be published.