AP New Districts Collectors, SPs Names | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు ప్రభుత్వం కలెక్టర్లను, జేసీలను, ఎస్పీలను నియమించింది. వారి పేర్లను ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా చేసింది. 26 జిల్లాలకు కావాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి చేసింది ప్రభుత్వం. కొత్త జిల్లాల విభజన ప్రకటనను అధికారికంగా వెలువడితే ఇక ఆచరణలోకి ఈ ప్రభుత్వ అధికారులు అందరూ సేవలు అందించనున్నారు. ఇప్పటికే 13 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు ఉన్నారు. అయితే కొత్త జిల్లాలకు కొందరి స్థానాలను మార్పులు చేర్పులు చేశారు.
కొత్త జిల్లాల మార్పు చేర్పులతో పాటు రాష్ట్రంలోని అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కీలకమైన పోస్టింగ్‌లలో అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే రవాణా శాఖ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్, సీఆర్డీఏ కమిషనర్‌గా వివేక్ యాదవ్‌ను, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా చేవూరి హరికిరణ్‌ను, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా జె.నివాస్‌ను, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా కె.ఆర్.బిహెచ్.ఎన్. చక్రవర్తిని నియమించింది.
దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జి.వాణిమోహన్‌ను యువజన వ్యవహారాలు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా హరిజవహార్ లాల్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా వీర పాండ్యన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా జాహ్నవిని నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌గా చేతన్‌ను బదిలీ చేశారు.
AP New Districts Collectors, SPs Names
జిల్లా | కలెక్టర్ | జేసీ | ఎస్పీ |
శ్రీకాకుళం | లత్కర్ శ్రీకేశ్ బాలాజీరావు | ఎం.విజయసునీత | జీఆర్ రాధిక |
విజయనగరం | ఎ.సూర్యకుమారి | కె.మయూర్ అశోక్ | ఎం.దీపిక |
పార్వతీపురం | నిశాంత్ కుమార్ | ఒ.ఆనంద్ | వి.విద్యాసాగర్ నాయుడు |
విశాఖపట్నం | ఎ.మల్లికార్జున | కేఎస్ విశ్వనాథన్ | సీహెచ్ శ్రీకాంత్ (కమిషనర్) |
అల్లూరి సీతారామరాజు | సుమీత్ కుమార్ | జి.సూరజ్ ధనంజయ్ | సతీష్‌కుమార్ |
అనకాపల్లి | పి.రవిసుభాష్ | కల్పనా కుమారి | గౌతమి శాలి |
కాకినాడ | కృతికా శుక్లా | ఎస్.ఇలాకియా | ఎం.రవీంద్రనాధ్బాబు |
తూర్పుగోదావరి | కె.మాధవీలత | శ్రీధర్ చామకూరి | ఐశ్వర్య రస్తోగి |
కోనసీమ | హిమాంశు శుక్లా | ధ్యానచంద్ర హెచ్ఎం | కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి |
పశ్చిమగోదావరి | పి.ప్రశాంతి | ఎం.అభిషిక్త్ కిషోర్ | రవి ప్రకాష్ |
ఏలూరు | ప్రసన్న వెంకటేశ్ | పి.అరుణ్‌బాబు | అమ్మిరెడ్డి |
కృష్ణా | పి.రంజిత్ బాషా | మహేష్ కుమార్ రావిరాల | సిదార్థ కౌశల్ |
ఎన్టీఆర్ | ఎస్.దిల్లీరావు | శ్రీవాస్ నూపూర్ అజయ్‌కుమార్ | క్రాంతి రాణా టాటా (విజయవాడ కమిషనర్) |
గుంటూరు | ఎం.వేణుగోపాల్ రెడ్డి | జి.రాజకుమారి | ఆరీఫ్ హఫీజ్ |
పల్నాడు | శివశంకర్ లోతేటి | ఎ.శ్యాంప్రసాద్ | రవిశంకర్ రెడ్డి |
బాపట్ల | కె.విజయ | కె.శ్రీనివాసులు | వకుల్ జిందాల్ |
ప్రకాశం | దినేశ్‌కుమార్ | జేవీ మురళి | మల్లికా గార్గ్ |
నెల్లూరు | కెవీఎన్ చక్రధర్‌బాబు | ఎంఎన్ హరేందిర ప్రసాద్ | విజయరావు |
తిరుపతి | కె.వెంకట రమణారెడ్డి | డీకే బాలాజీ | పరమేశ్వర రెడ్డి |
చిత్తూరు | ఎం.హరినారాయణ | వెంకటేశ్వర్ సలిజామల | రిశాంత్ రెడ్డి |
అన్నమయ్య | పీఎస్ గిరీష | దమీమ్ అన్సారియా | హర్షవర్ధన్ రాజు |
కడప | విజయరామరాజు వి | శ్రీకాంత్ వర్మ | అన్భురాజన్ |
శ్రీ సత్యసాయి | పి.బసంత్ కుమార్ | కొత్తమాసు దినేశ్‌కుమార్ | రాజుదేవ్సింగ్ |
అనంతపురం | ఎస్.నాగలక్ష్మి | కేతన్ గార్గ్ | ఫకీరప్ప |
నంద్యాల | మనజీర్ జిలాని సమూన్ | నారపురెడ్డి మౌర్య | రఘువీరారెడ్డి |
కర్నూలు | పి.కోటేశ్వరరావు | ఎస్.రామసుందర్ రెడ్డి | సుధీర్‌కుమార్ రెడ్డి |
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ