AP New Cabinet Ministers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పాత మంత్రులు అందరూ రాజీనామాలు చేసి సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కి అందజేశారు. ప్రస్తుతం కొత్త మంత్రుల క్యాబినెట్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కొత్త మంత్రుల(AP New Cabinet Ministers) ఎంపికను సీఎం జగన్ పూర్తి చేశారు. అధికారికంగా ఆ వివరాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కొత్త మంత్రి వర్గంలో నలుగురు మహిళలకు ఛాన్క్ దక్కబోతోంది. అలాగే పార్టీ ప్రారంభం నుంచి జగన్‌కు స్నేహితురాలిగా, పార్టీ తరపున టిడిపి ఎదుర్కొంటూ వస్తున్న నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు అవకాశం దక్కబోతున్నట్టు సమాచారం.
కొత్త మంత్రులు వీరేనా?
వైఎస్సార్సీపీ కీలక నాయకులు వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త మంత్రివర్గం ఈ విధంగా ఉండబోతోంది. ప్రస్తుత క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న ఆదిమూలపు సురేష్, సిదిరి అప్పలరాజు, వేణు గోపాల కృష్ణ, గుమ్మనూరు జయరాం, శంకర్ నారాయణ కొనసాగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగా సిదిరి అప్పలరాజుతో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు అవకాశం దక్కబోతోంది. విజయనగరం నుంచి సీనియర్ ఎమ్మెల్యే రాజన్న దొర, కొల్లి భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించబోతున్నారు.
విశాఖ జిల్లా నుంచి బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్ కు అవకాశం దక్కబోతోంది. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో పాటు, ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కొనసాగనున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి ఛాన్స్ దక్కబోతోంది. కృష్ణా జిల్లా నుంచి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, ఎన్టీఆర్ జిల్లా నుంచి తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కానీ, మొండితోక జగన్మోహన్రావుకు ఛాన్స్ ఉండబోతోంది.
ఇక గుంటూరు జిల్లా నుంచి సిటీ ఎమ్మెల్యే ముస్తఫా, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజని, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జునకు అవకాశం ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి ఆదిమూలపు సురేష్ కొనసాగుతుండగా నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్థన్ రెడ్డితో పాటు, సంజీవయ్యకు అవకాశం దక్కబోతోంది. చిత్తూరు జిల్లా నుంచి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ కు ఛాన్స్ ఉంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుత మంత్రి గుమ్మనూరు జయరాం కొనసాగబోతూ ఉండగా, కొత్తగా శిల్పా చక్రపాణి రెడ్డి, సుధాకర్‌కు అవకాశం దక్కబోతోంది. అనంతపురం జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి శంకర్ నారాయణ కొనసాగబోతున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!