Ap Movie Ticket Prices | ఆంధ్రప్రదేశ్లోని సినిమా టికెట్ల వివాదానికి తెర పడింది. సోమవారం ఏపీ గవర్నమెంట్ సినిమా టికెట్ల ధరలు ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. ఏపీలో కొన్ని నెలలుగా సినిమా వివాదాలు సంచలనాలకు తెరలేపాయి. ఈ క్రమంలో టాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి కొందరు ప్రముఖులు ఏపీ ప్రభుత్వానికి పలుమార్లు కలిశారు. సినిమా పరిశ్రమ, టికెట్ల ధరల పెంపు పై చర్చలు జరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం సమస్యను వారికి సానుకూలంగా (Ap Movie Ticket Prices)పరిష్కరించలేదు.
ఈ క్రమంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మెగస్టార్ చిరంజీవి తనతో పాటు హీరోలు ప్రభాస్, మహేష్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఆలీ, పోసానీ కృష్ణ మురళి మరికొందరు సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిని గత నెలలో కలిశారు.ఈ సందర్భంగా గంట పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చిల ఫలితంగా జీవో జారీ చేస్తానని అదే రోజు చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇటీవల ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తు మరణంతో టికెట్ల వ్యవహారం కాస్త ఆలస్యమైంది.
ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ ప్రభుత్వం అధికారికంగా సినిమా టికెట్ల రేట్లను ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. ఇటీవల పవన్ కల్యాణ్ తీసిన భీమ్లా నాయక్ సినిమా విడుదలై పాత రేట్లకు థియోటర్లలో కొనసాగుతుంది. అయితే బాహుబలి హీరో ప్రభాస్ అదృష్టం కొద్దీ రాధేశ్యామ్ విడుదలకు ముందే ఏపీ సినిమా టికెట్ల పెంపు జీవో రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా టికెట్ల వివరాలుః
1.కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో టికెట్ ధర రూ.70, రూ.100
2.కార్పొరేషన్లలో నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ దర రూ.40, రూ.60
3.కార్పొరేషన్ స్పెషల్ థియేటర్లలటో రూ.100, రూ.125
4.కార్పొరేషన్ మల్టీఫెక్సీలో టికెట్ ధర రూ.150, రూ.250
5.మున్సిపాలిటీలో ఏసీ థియేటర్లలో టికెట్ ధర రూ.60, రూ.80
6.మున్సిపాలిటీలో నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ ధర రూ.30, రూ.50
7.మున్సిపాలిటీలో స్పెషల్ థియేటర్లలో టికెట్ ధర రూ.80, రూ.100
8.మున్సిపాలిటీలో మల్టీఫ్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.125, రూ.250
9.నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70
10.నగర పంచాయతీల్లో నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ ధర రూ.20, రూ.40
11.నగర పంచాయతీల్లో స్పెషల్ థియేటర్లలో టికెట్ ధర రూ.70, రూ.90
12.నగర పంచాయతీల్లో మల్టీఫెక్స్లో టికెట్ ధర రూ.100, రూ.250
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!