AP Local Body Election Notification-2021 | ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
AP Local Body Election Notification-2021 | ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలVijayawada: ఏపీలోని తొలి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. జనవరి 29 నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 21తో ముగుస్తుంది. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ
జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 9న పోలింగ్ (ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల) వరకు
ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
ఏపీలో రెండో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్
ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 4 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 6న నామినేషన్ల పై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు
ఫిబ్రవరి 13న పోలింగ్ (ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు)
ఫిబ్రవరి 13న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.
ఏపీలో మూడో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్
ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 8 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 9న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 10న నామినేషన్ల పై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 12న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు
ఫిబ్రవరి 17న పోలింగ్ (ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు)
ఫిబ్రవరి 17న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.
ఏపీలో నాల్గో దశ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్
ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 13న నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 14న నామినేషన్ల పై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 16న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు
ఫిబ్రవరి 21న పోలింగ్ (ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు)
ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికలు జరిగే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు