AP Local bodies Elections Updates : Supreme Court Judgement |సుప్రీం కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుంది?
AP Local bodies Elections Updates : Supreme Court Judgement |సుప్రీం కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుంది?Amaravathi: ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించింది. జస్టీస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేసింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ సర్కార్, ఉద్యోగులు వేసిన పిటిషన్లను సుప్రం కోర్టు కొట్టేసింది. ఏపీ తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఎన్నికలకు సబంధించి ఫిబ్రవరి మొదటి వారం వరకు గడువు ఇవ్వాలని ఏపీ సర్కార్ తరపు లాయర్ సుప్రీం కోర్టును కోరారు. అనేక సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయని ఇది మందచి పద్ధతి కాదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధంగా తన పని చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పిటిషన్లు వేసిన వారిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో మీ జోక్యమేమిటంటూ ఉద్యోగ సంఘాలపై ఆయన ఆగ్రహించారు. ఫైనల్‌గా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఏపీ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోనుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల షెడ్యూల్ మార్పు
మొదటి విడత జరగాల్సిన ఎన్నిక నాలుగోవ విడతగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్చింది. రెండో విడత ఎన్నికలను మొదటి విడతగా , మూడో విడతను రెండో విడతగా మార్చింది. అయితే స్థానికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదననను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ను జస్టీస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ విచారింది. ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ బెంచ్‌లోని జస్టీస్ హృషికేష్ రాయ్ కూడా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదించారు. అయితే సోమవారం సాయత్రం జిల్లా కలెక్టర్లతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లను సమీక్ష చేయనున్నారు. అందరూ హాజరు కావాలని ఆదేశించారు.
రిపబ్లిక్ ఇమేజస్ ఫ్రీ డౌన్లోడ్: డైరెక్ట్ డౌన్లోడ్