AP in MPTC, ZPTC Elections: వారికి మరో అవకాశం ఇచ్చిన ఎస్ఈసీ
AP in MPTC, ZPTC Elections: Vijayawada : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రలోభాలు, బెదిరింపులు కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్ఈసీ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశమిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 20 లోపు ఇటువంటి నామినేషన్లు వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ పేర్కొంది. గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలని ఎస్ఈసీ పేర్కొంది.
ఫిర్యాదులు లేకపోయినా, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో వివరించింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు. ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపులు కారణంగా నామినేషన్ వేయని వారికి తిరిగి అవకాశం కల్పించాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. గుంటూరులోని మాచర్ల, కడపలోని పులివెందుల, రాయచోటి, చిత్తూరులోని పుంగనూరు, పలమనేరు, తిరుపతి నగర పాలక సంస్థలో సింగిల్ నామినేషన్లపై అధికారులను రమేష్ కుమార్ నివేదిక కోరారు. ఈ నెల 20 లోపు పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బెదిరిస్తున్నారని రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఆ వార్డుల్లో నామినేషన్లు తీసుకోవాలని సూచించారు. బెదిరింపులపై మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే సంబంధిత అధకారులను సంప్రదించాలని కోరారు. ఆయా రాజకీయ పక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది చదవండి:కొత్త స్ట్రెయిన్లతో ముప్పు..అప్రమత్తమైన కేంద్రం
ఇది చదవండి:హత్యలు వెనుక టిఆర్ఎస్ పాత్ర: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ఇది చదవండి:మనిషి మాంసం తినే తెగ గురించి తెలుసా?
ఇది చదవండి:జీతాల్లేవు..భద్రత లేదు!
ఇది చదవండి:తెలంగాణ కోడలను నేను.. విమర్శకులకు షర్మిలా సమాధానం!
ఇది చదవండి:పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య