AP Half Day Schools 2022 | ఆంధ్రప్రదేశ్లోని ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 1 1 నుంచి 9వ తరగతి వరకు ఏప్రిల్ నెలాఖరు రోజు చివరి పనిదినంగా, అనంతరం 10వ తరగతి పరీక్షలు నిర్వహిం చాలని ఎస్సీఈఆర్టీ గతంలో క్యాలెండర్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. గతేడాది 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటి పూట బడులు జరిపారు. ఈ ఏడాది 2022 మార్చి మొదటి వారంలోనే వేసవిని తలపించేలా ఎండలు(AP Half Day Schools 2022) మండుతున్నాయి.
ఈ క్రమంలో ఈ ఏడాది ముందుగానే 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై వివిద శాఖలతో పాటు విద్యాశాఖ అభిప్రాయాన్ని తీసుకుని ప్రకటించనుంది. గతేడాది ఒంటి పూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించి, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం అందించారు. ఈ ఏడాది కూడా అదే విధంగా నిర్వహించాలని, పరీక్షలకు కనీసం 10 రోజులు ముందుగానే సిలబస్ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. తద్వారా విద్యార్థులకు మరోసారి రివిజన్ చేసుకునే సమయం ఉంటుంది. అలాగే ఫార్మేటివ్ అసెస్మెంట్ -3 పరీక్షల షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులు జరగనున్నట్టు సమాచారం.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!