AP Half Day School Timings 2022 | ఈ ఏడాది 2022, ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు ఒక్కపూట నడుస్తాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఇటీవల టైం టేబుల్‌ను, గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాల్సి ఉంది. 1 నుంచి 10వ తరగతి వరకు తరగతులు ఉదయం 7.45 గంటల నుంచి 11.30 గంటల వరకు జరగుతాయి. అయితే ఏపీలో పాఠశాలలకు జూన్ 1 నుండి వేసవి సెలవులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే ఎండలు మండుతున్న నేపథ్యంలో ఈ మార్చి నెలలోనే ఒంటిపూట బడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
AP Half Day School Timings 2022
ఇప్పటికే కరోనా కారణంగా ఏపీలోని పాఠశాలలు నామమాత్రంగా కొనసాగాయి. గత రెండు సంవత్సరాలు అసలు బళ్ళు తెరిచింది లేదు. ఈ ఏడాది 2022 లో కరోనా ఉపశమనంతో పిల్లలు ప్రశాంతంగా స్కూళ్లకు వెళుతున్నారు. అయితే ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల మొదటి వారం నుంచే అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సి వస్తోంది.
ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలలోనూ తాగునీటి వసతి కల్పించాలన్నారు. దాతలు, వాలంటీర్ల సమన్వయంతో మధ్యాహ్న భోజన సమయంలో మజ్జిక పంపిణీ చేస్తే బాగుంటందని తెలిపారు. మధ్యాహ్న భోజనం మాత్రం ఒంటిపూట బడుల సమయంలో తరగతులు ముగిసిన తర్వాతనే పెట్టాలని సూచించారు.
PERIOD | TIME |
1st BELL | 7.45 AM |
PRAYER: | 7.50 AM-8.00 AM |
1st PERIOD: | 8.00 AM-8.45 AM |
2nd PERIOD: | 8.45 AM-9.25 AM |
DRINKING WATER | 9.25 AM-9.30 AM |
3rd PERIOD: | 9.30 AM-10.10 AM |
INTERVAL: | 10.10 AM-10.25 AM |
4th PERIOD: | 10.25 AM-11.05 AM |
5th PERIOD: | 11.05 AM-11.45 AM |
DRINKING WATER | 11.45 AM-11.50 AM |
6TH PERIOD | 11.50 AM-12.30 AM |
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!