AP Grama Volunteer : Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు చేస్తున్న పనులు కనీసం నెలకు జీతం రూ.40 వేలు తీసుకునే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా చేయడం లేదేమో! ఎందుకంటే పనిలో నిబద్ధత, సామాజిక సైనికుడిలా పరిగెత్తడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి చిన్న పూరి గుడెసెలో ఉన్న ముసలవ్వకు అందించి, వారి ముఖంలో చిరునవ్వు చూసే మొదటి వ్యక్తిగా కనిపించే ఏకైక భద్రతలేని సగటు జీవన పోరాట ఉద్యోగి మాత్రమే. వారి సేవలను దేశవ్యాప్తంగా మెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఆపద, విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి చేసిన సేవలకు కథలు కథలుగా ప్రచురించిన పత్రికల్లో పెద్ద అక్షరాలూ సాక్షాలుగానే కనిపిస్తున్నాయి. ఎవరు ఎన్ని ప్రశంసలు పొగిడినా ఏ ప్రయోజనం, కష్టమనే బాధను ఇంటి గుమ్మంలోనే వదిలేసి వీర సైనికుడిలా 50 ఇళ్లను పలకరిస్తూ బాగోగులు అడుగుతూ పక్కచిక్కిన శరీరాలతో నీరసం పడుతున్నారు.


ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజలకు మంచి స్పందనే ఉందని, మన సేవలూ ప్రభుత్వానికి అవసరం పడుతున్నాయనే ఆలోచనతో, వాలంటీర్ల బాధలు ప్రభుత్వం పట్టించుకుంటుందేమోనని కాస్త ఆశగా ఆలోచించుకొని మొన్నామధ్య జీతాలు చాలడం లేదు సార్! అంటూ ఏపీ వ్యాప్తంగా సమ్మె చేశారు. ఆ సమ్మె కాస్త అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసినప్పటికీ, వారి డిమాండ్ మాత్రం అట్టడుక్కి చేరిందనేది వాస్తవం. వారి సేవలు మాకు అవసరం అనే వారు ఏపీలో చాలా మంది ప్రజలు ఉన్నారు. కానీ వారి జీతాల విషయానికి వస్తేనే సామాజిక సేవగా ముద్రణ పడుతూ సతమతమవుతున్నారు. ఇక వాలంటీర్ల సమ్మెతో ఒక్కసారిగా ఉలిక్క పడ్డ ఏపీ ప్రభుత్వం మరుసటి రోజే స్పందించింది. ఏకంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుగజేసుకుని ప్రియమైన వాలంటీర్ అంటూ! పెద్ద లేఖ రాశారు. ఇది ఉద్యోగం కాదు. సేవ మాత్రమే. ఆ సేవ చేసుకుని పుణ్యం సంపాదించుకోండనే విధంగా పరోక్షంగా జీతాలు పెంచమనే సంకేతాన్ని తెలియజేశారు.


తాజాగా వారి సేవలకు జీతాలు పెంచకపోయినా, వారి సేవలను గుర్తిస్తామని, వారిని సన్మానిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సచ్ఛీలత, మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్ ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కోవిడ్ -19 సర్వే తదితర అంశాల ఎంపికకు ప్రామాణికంగా తీసుకుని అవార్డులు ప్రధానం చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ విధానంలో మూడు కేటగిరీలను ఎంపిక చేసింది. రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేలు నగదు బహుమతులు ఉంటాయని పేర్కొంది.


వాలంటీర్ ఆవేదన ఇదే!
ఇలా బహుమతులు ప్రదానంలో భాగంగా ఎంపిక చేయడంలో క్యాటగిరీ పెరిగే కొద్ది లబ్ధిదారులు తగ్గిపోతారు. చివరి కేటగిరిలో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున అంటే 175×5 లెక్కన కేవలం 875 మందికి మొత్తం అన్ని కేటగిరీల లబ్ధిదారులను కలుపుకుంటే కనీసం మొత్తం వాలంటీర్లలో 10 శాతం కూడా ఉండదనేది విశ్లేషకుల లెక్క. ఇదంతా ఏడాదికి ఒకసారి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏడాది గడిచిపోయింది. గడిచిన ఏడాదిలో వాలంటీర్లకు ఏమీ లేదు. ప్రతిసారీ లబ్ధిదారులను మార్చినా వచ్చే ఎన్నికల నాటికి సగం మంది కూడా కవర్ కారు. అయితే ఇదంతా ఆలోచించిన సగటు వాలంటీర్ మా కష్టానికి జీతం పెంచమంటే బిచ్ఛమేస్తున్నారా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా వాలంటీర్లకు న్యాయ బద్ధంగా కాస్త జీతం పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త పనిభారం మరింత సులువు అవుతుందనేది ప్రతి ఒక్కరూ అనుకునే మాట.
ఇది చదవండి:వత్సవాయి : టిడిపి కార్యకర్త వాహనానికి నిప్పు!
ఇది చదవండి:దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:చాపకింద నీరులా సెకండ్ స్ట్రెయిన్ ముప్పు!
ఇది చదవండి:పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్ ప్రయోగం విజయవంతం
ఇది చదవండి:బ్రిందలో అరుదైన శస్త్ర చికిత్స
ఇది చదవండి:రైతు గొప్పతనాన్ని తెలిపిన శ్రీకారం మూవీ సాంగ్ సూపర్!
ఇది చదవండి:వెంకన్న సన్నిధిలో భక్తులకు పెద్దపీట!