AP Grama panchayat election polling : జగ్గయ్యపేటలో కొనసాగుతున్న పోలింగ్
AP Grama panchayat election polling :Jaggayyapeta: కృష్ణ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గ్రామ పంచాయతీ తొలివిడత సర్పంచ్, వార్డు మెంబర్ల ఎలక్షన్ పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైంది. 15 గ్రామాల నుండి సుమారు 41 మంది సర్పంచ్ అభ్యర్థులు, సుమారు 300 మంది వార్డు మెంబర్ల అభ్యర్థులు పోటీ బరిలో ఉన్నారు. అభ్యర్థులు ప్రజల ఓట్ల కోసం నిన్నటి దాకా ప్రసన్నం చేసుకున్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో గల గ్రామాలలో ఉదయం నుండే మొదలైన పోలింగ్ బారులు తీరిన ఓటర్లు, ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, మరియు మాస్క్ తప్పనిసరిగా తీసుకొని రావాలని, అలా వచ్చిన వారిని ఓటు వేయడానికి ఎలక్షన్ అధికారులు అనుమతి ఇస్తున్నారు.
అధికార వైసీపీ తరుపున బలపర్చిన పోటీ చేయుచున్న అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థులు, గ్రామాల్లో అధికార పార్టీగా వైసీపీ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమీ లేదని, అభివృద్ధి జరగాలంటే టిడిపి అభ్యర్థులకు ప్రజలు ఓటువేస్థారని టిడిపి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు తాము ప్రజలకు స్వచ్ఛందంగా సేలు చేస్తున్నామని వ్యక్తిగతంగా మాకే ప్రజలు ఓట్లు వేస్తారని ఆశను వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఓటరు మహాశయులు గ్రామాలలో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు మెంబర్లలో ఏ అభ్యర్థులకు గెలుపు పీఠాన్ని ప్రజలు కట్టబెతారో ఉత్కంఠంగా మారింది.

AP Grama panchayat election polling : 55 ఓట్లు గల్లంతయ్యాయని ఆందోళన
కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కాకరవాయి గ్రామంలో సుమారు 55 మంది ఓటర్లు తమ ఓట్లు గల్లంత య్యాయని ఆందోళన చెందుతున్నారు. అక్కడే ఉన్న సంబంధిత అధికారిని సంప్రదించగా మా వద్ద ఉన్నటువంటి ఓటర్ల జాబితా ఆధారంగా మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని లేనప్పుడు తాము చేసేది ఏమీ లేదని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న వత్సవాయి తహశీల్దారు ప్రత్యేక దృష్టి సాధించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఓటు అవకాశాన్ని కల్పించవల్సిందిగా కోరుతున్నారు.
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!
ఇది చదవండి:ఎన్నికల వేళ ఏపీలో భారీగా మద్యం స్వాధీనం!
ఇది చదవండి: మంత్రి పువ్వాడపైన నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
ఇది చదవండి:పదేళ్లు నేనే సీఎంను! ఇది పక్కా!
ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్
ఇది చదవండి:కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
ఇది చదవండి:10న నల్గొండకు సీఎం కేసీఆర్
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు