IPS Officer

IPS Officer: యుద్ధం మొద‌లైన చోట నుంచే న‌రుక్కొస్తా! అంటున్న సీనియ‌ర్ ఐపీఎస్‌?

Spread the love

IPS Officer: అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు న్యాయ‌పోరాటానికి దిగుతున్నారు. గ‌త నెల 19న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు(IPS Officer AB Venkateswara rao) లీగ‌ల్ నోటీసులు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ‘యుద్ధం ఎక్క‌డి నుంచి మొద‌లైందో అక్క‌డి నుంచే న‌రుక్కొస్తా.. ‘అని ఆయ‌న హెచ్చ‌రించారు.

త‌న‌పై త‌ప్పుడు ఫిర్యాదు చేసి ఇంటెలిజెన్స్ పోస్టు నుంచి తొల‌గించార‌ని ఆరోపించారు. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో పాటు సాక్షి మీడియా, అప్ప‌ట్లో ఆ వ్య‌వ‌హారాలు చూసిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు రామ‌చంద్ర‌మూర్తితో స‌హా ఏడుగురికి ప‌రువున‌ష్టం నోటీసులిచ్చారు. ఈ కార‌ణంగానే త‌న డిస్మిసల్‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపార‌ని సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు భావిస్తున్నారు.

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ను డిస్మిస్ చేయాల‌ని ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వానికి అధికారిక ప్ర‌తిపాద‌న‌లు పంపింది. వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌ర్వాత అధికారంలోకి రాగానే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు కూడా వేశారు. నిఘా ప‌రిక‌రాల కొనుగోలు ఆరోప‌ణ‌ల‌తో పాటు కొంద‌రు అధికారుల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడి స‌ర్వీసు నిబంధ‌న‌లు ఉల్లంఘించారంటూ అభియోగాలు న‌మోదు చేశారు. ఆయ‌న సస్పెన్ష‌న్ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. శాఖాప‌ర‌మైన విచార‌ణ‌లో భాగంగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కొద్ది రోజుల క్రితం క‌మిష‌న‌ర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎదుట హాజ‌రై త‌న వాంగ్మూలం ఇచ్చారు.

ఇటీవ‌ల ఆయ‌న కేసుల‌కు సంబంధించి ప్ర‌జెంటింగ్ ఆఫీస‌ర్‌ను కూడా నియ‌మించారు. ఇంత‌లోనే ఆయ‌న్ను స‌ర్వీస్ నుంచి డిస్మిస్ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

RS Praveen Kumar: నెల‌లో ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ రాజ‌కీయ ప్ర‌యాణం ఎలా ఉందంటే?

RS Praveen Kumar: మాజీ ఐపిఎస్ అధికారి ప్ర‌స్తుతం బిఎస్పీ నేత ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ కుమార్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి బుధ‌వారానికి నెల పూర్త‌య్యింది. ఈ Read more

Mudragada letter: నా ఉత్త‌రాల‌కు భుజాలు త‌డుముకుంటున్న పెద్ద‌లు ఎందుకో మరి!?

Mudragada letter కాపు సంఘం అధినేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రాసిన లేక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త‌న ఉత్త‌రాలు చ‌దివి చాలా మంది పెద్ద‌లు భుజాలు Read more

TDP Volunteers: ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారనున్న వాలంటీర్లు

TDP Volunteers అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పైన ప‌లు విమ‌ర్శ‌లు చేసిన టిడిపి ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుని పార్టీ క్యాడ‌ర్‌లో ఉత్స‌హాన్ని నింపే ప్ర‌య‌త్నం Read more

fake currency:దారి బాట‌లో న‌కిలీ క‌రెన్సీ క‌ట్ట!

fake currencyవినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఈపూరు మండ‌లంలోని న‌కిలీ క‌రెన్సీ వెలుగు చూసింది. ఓ రైతు పొలంకు వెళుతుండ‌గా క‌వ‌ర్లో న‌కిలీ క‌రెన్సీ ఉండ‌టాన్ని Read more

Leave a Comment

Your email address will not be published.