Covid Hospital : తిరువూరు ప్రాంతంలోని కరోనా వైరస్ సోకిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిత్స నిమిత్తం విజయవాడ, తదితర ప్రాంతాలకు వెళ్లిన్నప్పటికీ అక్కడ బెడ్లు దొరక్క నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తిరువూరులో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Covid Hospital : Tiruvuru: కృష్ణా జిల్లా తిరువూరులో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. తిరువూరులో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఏ.ఎండి ఇంతియాజ్, స్థానిక శాసనసభ్యులు కొక్కిలగడ్డ రక్షణనిధి తో కలిసి అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాధిగ్రస్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రతీ నియోజకవర్గంలోని కోవిడ్ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరువూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి వారం క్రితమే వైద్యాధికారులతో సమీక్షించామన్నారు.
రెండు – మూడురోజుల్లో ఏర్పాటు
ఆసుపత్రి ఏర్పాటులో అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాలు,సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అధికారులతో చర్చించామన్నారు. వైద్యులు, సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిపై నియామకానికి సంబంధించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నియమిస్తామన్నారు. అర్హత గల వారు జిల్లా కలెక్టర్ లేదా జిల్లా వైద్య శాఖాధికారిని కలిసి తమ దరఖాస్తును సమర్పించా లన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న కోవిడ్ ఆసుపత్రిలో అత్యవసర సేవలకు అవసరమైన ఆక్సిజన్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను ఏర్పాటు చేస్తున్నామని, మిగిలిన 5 కాన్సన్ట్రేటర్స్ను తాను అందిస్తానని మంత్రి చెప్పారు. వీటితో పాటు ఆక్సిజన్ సిలెండర్లకు ఎటువంటి కొరత రాకుండా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఏం.ఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రదేశాలలో కోవిడ్ సెకండ్ వేవ్ వైరస్ ప్రత్యేక చికిత్స అవసరమవుతున్నదన్నారు. చికిత్స విధానం, కోవిడ్ ఆసుపత్రిలో సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది నియామకంపై తదితర అంశాలపై అధికారులతో వైద్యాధికారులతో విసృత్తంగా చర్చించడం జరిగిందన్నారు. రెండు మూడు రోజుల్లో తిరువూరులో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు.


ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గం జిల్లాకు చివరన ఉండటంతో కోవిడ్ వ్యాధిగ్రస్థులు చికిత్స కోసం విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ బెడ్లు లేకపోవడం తదితర సమస్యల కారణంగా తిరువూరు పరిసర ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయవలసిందిగా సీఎంను కోరామన్నారు. వెంటనే ఈ ప్రాంతానికి కోవిడ్ ఆసుపత్రిని మంజూరు చేశారని అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.సుహాసిని, జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి డా.జ్యోతిర్మయి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా.డి ఆశ, మున్సిపల్ ఛైర్ పర్సన్ కస్తూరిబాయి, మునిసిపల్ కమిషనర్ కెవిఎస్ఎన్ శర్మ, తహశీల్ధార్ స్వర్గం నరసింహారావు, ఎంపిడిఓ బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!